Salin sa Wikang Telugu ni Abdur Rahim bin Muhammad
Pagsasalin ng mga Kahulugan ng Marangal na Qur'an
Isinalin ito ni Abdur Rahim bin Muhammad.
إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةِ ٱلۡقَدۡرِ
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో[1] అవతరింపజేశాము.[2]
[1] ఈ రాత్రి 'రమదాన్ నెలలోని చివరి 10 రోజులలో బేసి రాత్రులలో ఒకటని, చాలా 'హదీస్'లు ఉన్నాయి. ఈ రాత్రిలో పూర్తి సంవత్సరపు తీర్మానాలు తీసుకోబడతాయి. ఈ రాత్రిలో చాలా మంది దైవదూత ('అలైహిమ్) లు దిగుతారు. చూడండి, 2:185.
[2] ఏడవ ఆకాశం పైన ఉండే లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి మొదటి ఆకాశంలోఉండే బైతుల్ 'ఇ'జ్జహ్ లో దివ్యఖుర్ఆన్ ఖద్ర్ రాత్రిలో అవతరింపజేయబడింది. (ఇబ్నె-కసీ'ర్).
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో[1] అవతరింపజేశాము.[2]
وَمَآ أَدۡرَىٰكَ مَا لَيۡلَةُ ٱلۡقَدۡرِ
మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?
మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?
لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٞ مِّنۡ أَلۡفِ شَهۡرٖ
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.[1]
[1] చూఈ రాత్రిలో చేసే ఆరాధన విలువ, వేయి నెలల కంటే ఎక్కువ అంటే 83 సంపత్సరాలు మరియు 4 నెలలు.
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.[1]
تَنَزَّلُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٖ
ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[1], తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.
[1] చూఅర్-రూ'హు: ఖుర్ఆన్ అవతరణా క్రమంలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. చూడండి, 19:17 మరియు 78:38 అర్-రూ'హు ఈ మూడుచోట్లలో జిబ్రీల్ ('అ.స.) కొరకు వాడబడింది. ఇంకా చూడండి, 19:17 వ్యాఖ్యానం 1.
ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[1], తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.
سَلَٰمٌ هِيَ حَتَّىٰ مَطۡلَعِ ٱلۡفَجۡرِ
ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.
ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.
share_via