الترجمة التلغوية - عبد الرحيم بن محمد
ترجمة معاني القرآن الكريم إلى اللغة التلغو، ترجمها عبد الرحيم بن محمد.
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా?(a)
(a) గడచిన సూరహ్ లో 3 కానుకలు పేర్కొనబడ్డాయి. ఈ సూరహ్ లో 3 అనుగ్రహాలు పేర్కొనబడ్డాయి. ఎదను తెరవటం - అంటే సత్యాన్ని గ్రహించటం, జ్ఞాన జ్యోతి పొందడం. చూడండి, 6:125 అంటే మార్గదర్శకత్వాన్ని అర్థం చేసుకొని గ్రహించటం.
రెండు సార్లు దైవప్రవక్త ('స'అస) ఎద చీల్చబడిందని స.హదీసుల ద్వారా తెలుస్తుంది. ఒకసారి బాల్యంలో అప్పుడు అతని వయస్సు 4 సంవత్సరాలుంటుంది. అప్పుడు జిబ్రీల్ ('అ.స.) వచ్చి, అతని ఎదను చీల్చి అతని హృదయంలో నున్న షై'తానుకు చోటిచ్చే భాగాన్ని తీసి వేస్తారు, ('స.ముస్లిం). రెండవసారి మేరాజ్ కు ముందు జిబ్రీల్ ('అ.స.) అతని ఎదను చీల్చి అతని హృదయాన్ని చీల్చి, బయటికి తీసి, 'జమ్'జమ్ తో దానిని కడిగి పెడ్తారు. దానిని విశ్వాసం (ఈమాన్) మరియు వివేకంతో నింపుతారు. ('స'హీ'హైన్).
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా?(a)
وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా?
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా?
ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?
وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ
మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?(a)
(a) అంటే అల్లాహ్ (సు.తా.) పేరు వచ్చినప్పుడల్లా దైవప్రవక్త ('స'అస) పేరు వస్తుంది. ఉదా: అజా'న్ లో, నమా'జ్ లో వగైరా.
మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?(a)
فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا
నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;
నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرٗا
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.(a)
(a) కష్టాల తరువాత దైవప్రవక్త ('స'అస) మరియు 'స'హాబీలు (ర'ది.'అన్హుమ్)లకు సుఖసంతోషాలు ప్రాప్తమయ్యాయి.
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.(a)
فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ
కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!
కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!
وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب
మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు.
మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు.
مشاركة عبر