ߕߟߌߜ߭ߏߦߊߞߊ߲ ߘߟߊߡߌߘߊ - ߊ߳ߺߊߓߑߘߎ ߚߊߤ߭ߌ߯ߡߎ߫ ߓߎߣ-ߡߎ߬ߤ߭ߊߡߡߊߘߎ߫ ߓߟߏ߫
ߊ߳ߺߊߓߑߘߎ߫ ߊ.ߚߊߤ߭ߌ߯ߡߎ߫ ߓߎߣ-ߡߎ߬ߤ߭ߊ߲ߡߊߘ ߓߟߏ߫
وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا
వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!(a)
فَٱلۡمُورِيَٰتِ قَدۡحٗا
తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;(a)
فَٱلۡمُغِيرَٰتِ صُبۡحٗا
తెల్లవారుఝామున దాడి చేసేవాటి;(a)
فَأَثَرۡنَ بِهِۦ نَقۡعٗا
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;(a)
فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا
(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.
إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٞ
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.(a)
وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٞ
మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.
وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ
మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.
۞ أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;(a)
وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;
إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٖ لَّخَبِيرُۢ
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!
مشاركة عبر