Tradução Telegráfica - Abdul Rahim bin Muhammad
Traduziu Maulana Abder-Rahim ibn Muhammad.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్(a) పేరుతో(b)
ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ
సర్వలోకాలకు ప్రభువైన(a) అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు(b).
ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత(a)
مَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ
తీర్పుదినానికి(a) స్వామి(b).
إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.(a)
ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ
మాకు ఋజుమార్గం(a) వైపునకు మార్గదర్శకత్వం చేయి.
صِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ
నీవు అనుగ్రహించిన(a) వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి(b) గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.
مشاركة عبر