Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad
Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu oleh Maulana Abdurrahim bin Muhammad.
أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?(a)
(a) ఈ ఆయతు దైవప్రవక్త ('స'అస)ను సంభోదిస్తోంది. దీన్ - అంటే పునరుత్థాన (తీర్పు) దినం. చూడండి, 109:6.
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?(a)
فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ
అతడే అనాథులను కసరి కొట్టేవాడు;(a)
(a) ఎందుకంటే అతడు పిసినారి, తీర్పుదినాన్ని విశ్వసించని వాడు మరియు ఇహలోకంలో చేసిన పుణ్యాలకు పరలోకంలో లభించే ప్రతిఫలాన్ని విశ్వసించని వాడు.
అతడే అనాథులను కసరి కొట్టేవాడు;(a)
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!(a)
(a) అనాథులను కసిరి కొట్టేవారికి, ఆకలిగొన్న పేదలకు అన్నం పెట్టని వారికి, నమా'జ్ చేయని వారికి 'వైల్' అనే నరకమే నివాస స్థల మవుతుంది. ఎందుకంటే వారు కపట విశ్వాసులు, హృదయపూర్వకంగా కాక ఇతరులకు చూపటానికే నమా'జ్ చేసేవారు.
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!(a)
ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!(a)
(a) ఇలాంటి వారు అసలు నమా'జ్ చేయరు. ఒకవేళ చేసినా అశ్రద్ధతో చేస్తారు, నిర్ణీత సమయంలో చేయరు. భయభక్తులతో నమా'జ్ చేయరు. చూడండి, 4:142.
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!(a)
ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!(a)
(a) అంటే ఇతరులతో ఉన్నప్పుడు వారి మెప్పు పొందటానికి నమా'జ్ చేస్తారు. ఏకాంతంలో ఉంటే నమా'జ్ ను వదలి పెడతారు.
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!(a)
وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!(a)
(a) మ'అనున్: అంటే కొద్దిపాటి సామాన్య చిన్న చిన్న సహాయాలు. ఇంట్లో వాడే వస్తువులను ఒకరి కొకరు ఇచ్చుకోవటం. చిన్న చిన్న సహాయాలు చేసుకోవటం.
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!(a)
مشاركة عبر