Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad
Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu oleh Maulana Abdurrahim bin Muhammad.
إِذَا ٱلشَّمۡسُ كُوِّرَتۡ
సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు!(a)
وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتۡ
మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు!
وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు!(a)
وَإِذَا ٱلۡعِشَارُ عُطِّلَتۡ
మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు!
وَإِذَا ٱلۡوُحُوشُ حُشِرَتۡ
మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు!(a)
وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు!(a)
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు!(a)
وَإِذَا ٱلۡمَوۡءُۥدَةُ سُئِلَتۡ
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు:
بِأَيِّ ذَنۢبٖ قُتِلَتۡ
ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని?
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు!(a)
وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتۡ
మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు!
وَإِذَا ٱلۡجَحِيمُ سُعِّرَتۡ
మరియు నరకాగ్ని మండించబడినప్పుడు!
وَإِذَا ٱلۡجَنَّةُ أُزۡلِفَتۡ
మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు!
عَلِمَتۡ نَفۡسٞ مَّآ أَحۡضَرَتۡ
ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది.
فَلَآ أُقۡسِمُ بِٱلۡخُنَّسِ
అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;
ٱلۡجَوَارِ ٱلۡكُنَّسِ
(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో!(a)
وَٱلَّيۡلِ إِذَا عَسۡعَسَ
మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా!
وَٱلصُّبۡحِ إِذَا تَنَفَّسَ
మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!
إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు!(a)
ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٖ
అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్)(a) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
مُّطَاعٖ ثَمَّ أَمِينٖ
అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!
وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٖ
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు!(a)
وَلَقَدۡ رَءَاهُ بِٱلۡأُفُقِ ٱلۡمُبِينِ
మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.(a)
وَمَا هُوَ عَلَى ٱلۡغَيۡبِ بِضَنِينٖ
మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.
وَمَا هُوَ بِقَوۡلِ شَيۡطَٰنٖ رَّجِيمٖ
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు.
فَأَيۡنَ تَذۡهَبُونَ
మరి మీరు ఎటు పోతున్నారు?
إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ لِّلۡعَٰلَمِينَ
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం.
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَسۡتَقِيمَ
మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.(a)
مشاركة عبر