Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad
Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu oleh Maulana Abdurrahim bin Muhammad.
لَآ أُقۡسِمُ بِهَٰذَا ٱلۡبَلَدِ
కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!
وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ
మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.(a)
وَوَالِدٖ وَمَا وَلَدَ
మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِي كَبَدٍ
వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.
أَيَحۡسَبُ أَن لَّن يَقۡدِرَ عَلَيۡهِ أَحَدٞ
ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?
يَقُولُ أَهۡلَكۡتُ مَالٗا لُّبَدًا
అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.(a)
أَيَحۡسَبُ أَن لَّمۡ يَرَهُۥٓ أَحَدٌ
ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?(a)
أَلَمۡ نَجۡعَل لَّهُۥ عَيۡنَيۡنِ
ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?
وَلِسَانٗا وَشَفَتَيۡنِ
మరియు నాలుకను మరియు రెండు పెదవులను.
وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.(a)
فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ
కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు!(a)
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡعَقَبَةُ
మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?
فَكُّ رَقَبَةٍ
అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.(a)
أَوۡ إِطۡعَٰمٞ فِي يَوۡمٖ ذِي مَسۡغَبَةٖ
లేదా! (స్వయంగా) ఆకలి గొని(a) ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.
يَتِيمٗا ذَا مَقۡرَبَةٍ
సమీప అనాథునికి గానీ;
أَوۡ مِسۡكِينٗا ذَا مَتۡرَبَةٖ
లేక, దిక్కులేని నిరుపేదకు గానీ!(a)
ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ
మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.
أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ
ఇలాంటి వారే కుడిపక్షం వారు.(a)
وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ
ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.
عَلَيۡهِمۡ نَارٞ مُّؤۡصَدَةُۢ
వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.(a)
مشاركة عبر