Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad
Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu oleh Maulana Abdurrahim bin Muhammad.
سَبَّحَ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ
ఆకాశాలలో నున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
هُوَ ٱلَّذِيٓ أَخۡرَجَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مِن دِيَٰرِهِمۡ لِأَوَّلِ ٱلۡحَشۡرِۚ مَا ظَنَنتُمۡ أَن يَخۡرُجُواْۖ وَظَنُّوٓاْ أَنَّهُم مَّانِعَتُهُمۡ حُصُونُهُم مِّنَ ٱللَّهِ فَأَتَىٰهُمُ ٱللَّهُ مِنۡ حَيۡثُ لَمۡ يَحۡتَسِبُواْۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ ٱلرُّعۡبَۚ يُخۡرِبُونَ بُيُوتَهُم بِأَيۡدِيهِمۡ وَأَيۡدِي ٱلۡمُؤۡمِنِينَ فَٱعۡتَبِرُواْ يَٰٓأُوْلِي ٱلۡأَبۡصَٰرِ
గ్రంథ ప్రజలలోని సత్యతిరస్కారులను మొదట సమీకరించిన (బనూ నదీర్ తెగ) వారిని, వారి గృహాల నుండి వెళ్లగొట్టినవాడు ఆయనే.(a) వారు వెళ్ళిపోతారని మీరు ఏ మాత్రం భావించలేదు. మరియు అల్లాహ్ నుండి తమను తమ కోటలు తప్పక రక్షిస్తాయని వారు భావించారు! కాని అల్లాహ్ (శిక్ష) వారు ఊహించని వైపు నుండి, వారిపై వచ్చి పడింది. మరియు ఆయన వారి హృదయాలలో భయం కలుగజేశాడు, కావున వారు తమ ఇండ్లను తమ చేతులారా మరియు విశ్వాసుల చేతులతో కూడా, నాశనం చేయించుకున్నారు. కావున ఓ పరిజ్ఞానం (కళ్ళు) గల వారలారా! గుణపాఠం నేర్చుకోండి.
وَلَوۡلَآ أَن كَتَبَ ٱللَّهُ عَلَيۡهِمُ ٱلۡجَلَآءَ لَعَذَّبَهُمۡ فِي ٱلدُّنۡيَاۖ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابُ ٱلنَّارِ
మరియు ఒకవేళ అల్లాహ్ వారి విషయంలో దేశ బహిష్కారం వ్రాసి ఉండకపోతే, వారిని ఈ ప్రపంచములోనే శిక్షిచి ఉండేవాడు. మరియు వారికి పరలోకంలో నరకాగ్ని శిక్ష పడుతుంది.
ذَٰلِكَ بِأَنَّهُمۡ شَآقُّواْ ٱللَّهَ وَرَسُولَهُۥۖ وَمَن يُشَآقِّ ٱللَّهَ فَإِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ
ఇది ఎందుకంటే, వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. మరియు అల్లాహ్ ను వ్యతిరేకించిన వాడిని శిక్షించటంలో నిశ్చయంగా, అల్లాహ్ చాలా కఠినుడు.
مَا قَطَعۡتُم مِّن لِّينَةٍ أَوۡ تَرَكۡتُمُوهَا قَآئِمَةً عَلَىٰٓ أُصُولِهَا فَبِإِذۡنِ ٱللَّهِ وَلِيُخۡزِيَ ٱلۡفَٰسِقِينَ
(ఓ విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో(a) లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్ళ మీద నిలబడేలా వదలి పెట్టారో, అంతా అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధేయులను అవమానించటానికి జరిగిన విషయం.
وَمَآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنۡهُمۡ فَمَآ أَوۡجَفۡتُمۡ عَلَيۡهِ مِنۡ خَيۡلٖ وَلَا رِكَابٖ وَلَٰكِنَّ ٱللَّهَ يُسَلِّطُ رُسُلَهُۥ عَلَىٰ مَن يَشَآءُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
మరియు అల్లాహ్ తన ప్రవక్తకు వారి నుండి ఇప్పించిన ఫయ్అ కొరకు, మీరు గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరిగెత్తించలేదు.(a) కాని అల్లాహ్ తాను కోరిన వారిపై, తన సందేశహరునికి ఆధిక్యత నొనంగుతాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
مَّآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنۡ أَهۡلِ ٱلۡقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِ كَيۡ لَا يَكُونَ دُولَةَۢ بَيۡنَ ٱلۡأَغۡنِيَآءِ مِنكُمۡۚ وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ
అల్లాహ్ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్అ లో) అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది.(a) అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగకుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్షించటంలో చాలా కఠినుడు.
لِلۡفُقَرَآءِ ٱلۡمُهَٰجِرِينَ ٱلَّذِينَ أُخۡرِجُواْ مِن دِيَٰرِهِمۡ وَأَمۡوَٰلِهِمۡ يَبۡتَغُونَ فَضۡلٗا مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٗا وَيَنصُرُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلصَّٰدِقُونَ
(దానిలో నుండి కొంతభాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడలగొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్ లకు) పేదవారికి కూడా హక్కు ఉంది. వారు అల్లాహ్ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరుతున్నారు. మరియు వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారు, వీరే సత్యవంతులు.(a)
وَٱلَّذِينَ تَبَوَّءُو ٱلدَّارَ وَٱلۡإِيمَٰنَ مِن قَبۡلِهِمۡ يُحِبُّونَ مَنۡ هَاجَرَ إِلَيۡهِمۡ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمۡ حَاجَةٗ مِّمَّآ أُوتُواْ وَيُؤۡثِرُونَ عَلَىٰٓ أَنفُسِهِمۡ وَلَوۡ كَانَ بِهِمۡ خَصَاصَةٞۚ وَمَن يُوقَ شُحَّ نَفۡسِهِۦ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ
మరియు ఎవరైతే - ఈ (వలస వచ్చినవారు) రాకపూర్వమే - విశ్వసించి వలస కేంద్రం (మదీనా)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కు వుంది.(a) వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలస వచ్చిన) వారికి ఏది ఇవ్వబడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే అత్మలోభం నుండి రక్షింప బడతారో! అలాంటి వారు, వారే! సాఫల్యం పొందేవారు. (b)
وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعۡدِهِمۡ يَقُولُونَ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا وَلِإِخۡوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلۡإِيمَٰنِ وَلَا تَجۡعَلۡ فِي قُلُوبِنَا غِلّٗا لِّلَّذِينَ ءَامَنُواْ رَبَّنَآ إِنَّكَ رَءُوفٞ رَّحِيمٌ
మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కు ఉంది. వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు.(a) ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు!"
۞ أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ نَافَقُواْ يَقُولُونَ لِإِخۡوَٰنِهِمُ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَئِنۡ أُخۡرِجۡتُمۡ لَنَخۡرُجَنَّ مَعَكُمۡ وَلَا نُطِيعُ فِيكُمۡ أَحَدًا أَبَدٗا وَإِن قُوتِلۡتُمۡ لَنَنصُرَنَّكُمۡ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ
(ఓ ముహమ్మద్!) కపట విశ్వాసుల గురించి నీకు తెలియదా?(a) వారు గ్రంథ ప్రజలలో సత్యతిరస్కారులైన తమ సోదరులతో, ఇలా అంటారు: "ఒకవేళ మీరు వెళ్ళగొట్ట బడినట్లయితే, మేము కూడా తప్పక మీతోబాటు వెళ్తాము. మరియు మీ విషయంలో మేము ఎవ్వరి మాటా వినము. ఒకవేళ మీతో యుద్ధం జరిగితే, మేము తప్పక మీకు సహాయపడతాము." మరియు నిశ్చయంగా, వారు అసత్యవాదులు, అల్లాహ్ యే దీనికి సాక్షి!
لَئِنۡ أُخۡرِجُواْ لَا يَخۡرُجُونَ مَعَهُمۡ وَلَئِن قُوتِلُواْ لَا يَنصُرُونَهُمۡ وَلَئِن نَّصَرُوهُمۡ لَيُوَلُّنَّ ٱلۡأَدۡبَٰرَ ثُمَّ لَا يُنصَرُونَ
కాని (వాస్తవానికి) వారు (యూదులు) వెడలగొట్టబడితే, వీరు (ఈ కపట విశ్వాసులు) వారి వెంట ఎంతమాత్రం వెళ్ళరు మరియు వారితో యుద్ధం జరిగితే, (ఈ కపట విశ్వాసులు) వారికి ఏ మాత్రం సహాయపడరు.(a) ఒకవేళ వీరు, వారికి (యూదులకు) సహాయపడినా, వారు తప్పక వెన్నుచూపి పారిపోతారు. ఆ తరువాత వారు విజయం (సహాయం) పొందలేరు.
لَأَنتُمۡ أَشَدُّ رَهۡبَةٗ فِي صُدُورِهِم مِّنَ ٱللَّهِۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَفۡقَهُونَ
వారి హృదయాలలో, అల్లాహ్ భయం కంటే, మీ భయమే ఎక్కువ ఉంది. ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అర్థం చేసుకోలేని జనులు.
لَا يُقَٰتِلُونَكُمۡ جَمِيعًا إِلَّا فِي قُرٗى مُّحَصَّنَةٍ أَوۡ مِن وَرَآءِ جُدُرِۭۚ بَأۡسُهُم بَيۡنَهُمۡ شَدِيدٞۚ تَحۡسَبُهُمۡ جَمِيعٗا وَقُلُوبُهُمۡ شَتَّىٰۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡقِلُونَ
వారందరూ కలిసి కూడా, దృఢమైన కోటలు గల నగరాలలోనో, లేదా గోడల చాటు నుండో తప్ప, మీతో యుద్ధం చేయజాలరు. వారి మధ్య ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషం, ఎంతో తీవ్రమైనది. వారు కలసి ఉన్నట్లు నీవు భావిస్తావు, కాని వారి హృదయాలు చీలి పోయి ఉన్నాయి. ఇది ఎందుకంటే, వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు.
كَمَثَلِ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَرِيبٗاۖ ذَاقُواْ وَبَالَ أَمۡرِهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ
వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ ఖైనుఖాఅ లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చవి చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది.(a)
كَمَثَلِ ٱلشَّيۡطَٰنِ إِذۡ قَالَ لِلۡإِنسَٰنِ ٱكۡفُرۡ فَلَمَّا كَفَرَ قَالَ إِنِّي بَرِيٓءٞ مِّنكَ إِنِّيٓ أَخَافُ ٱللَّهَ رَبَّ ٱلۡعَٰلَمِينَ
వారి దృష్టాంతం మానవుణ్ణి ప్రేరేపిస్తూ, ఇలా అనే ఆ షైతాన్ వలే ఉంది. అతడు: "సత్యాన్ని తిరస్కరించు." అని అంటాడు. అతడు తిరస్కరించిన తరువాత ఇలా అంటాడు: "నిశ్చయంగా, నాకు నీతో ఏ విధమైన సంబంధం లేదు, నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడేవాడిని!"(a)
فَكَانَ عَٰقِبَتَهُمَآ أَنَّهُمَا فِي ٱلنَّارِ خَٰلِدَيۡنِ فِيهَاۚ وَذَٰلِكَ جَزَٰٓؤُاْ ٱلظَّٰلِمِينَ
తరువాత ఆ ఇద్దరి పర్యవసానం, నిశ్చయంగా, ఆ ఇరువురూ నరకాగ్నిలో ఉండటమే! అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే!
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَلۡتَنظُرۡ نَفۡسٞ مَّا قَدَّمَتۡ لِغَدٖۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు ప్రతి వ్యక్తి, తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును!
وَلَا تَكُونُواْ كَٱلَّذِينَ نَسُواْ ٱللَّهَ فَأَنسَىٰهُمۡ أَنفُسَهُمۡۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ
మరియు అల్లాహ్ ను మరచి పోయిన వారి మాదిరిగా మీరూ అయి పోకండి. అందువలన ఆయన వారిని, తమను తాము మరచిపోయేటట్లు చేశాడు. అలాంటి వారు! వారే అవిధేయులు (ఫాసిఖూన్).
لَا يَسۡتَوِيٓ أَصۡحَٰبُ ٱلنَّارِ وَأَصۡحَٰبُ ٱلۡجَنَّةِۚ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِ هُمُ ٱلۡفَآئِزُونَ
నరకవాసులు మరియు స్వర్గవాసులు సరిసమానులు కాజాలరు. స్వర్గవాసులు, వారే! విజయం పొందేవారు.
لَوۡ أَنزَلۡنَا هَٰذَا ٱلۡقُرۡءَانَ عَلَىٰ جَبَلٖ لَّرَأَيۡتَهُۥ خَٰشِعٗا مُّتَصَدِّعٗا مِّنۡ خَشۡيَةِ ٱللَّهِۚ وَتِلۡكَ ٱلۡأَمۡثَٰلُ نَضۡرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ
ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం పైనైనా అవతరింపజేసి ఉంటే, అల్లాహ్ భయం వల్ల అది అణిగి బ్రద్దలై పోవటాన్ని నీవు చూసి ఉంటావు. మరియు బహుశా ప్రజలు ఆలోచిస్తారని, ఇలాంటి దృష్టాంతాలను మేము వారి ముందు పెడుతున్నాము.
هُوَ ٱللَّهُ ٱلَّذِي لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ عَٰلِمُ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِۖ هُوَ ٱلرَّحۡمَٰنُ ٱلرَّحِيمُ
ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! ఆయనకు అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలుసు.(a) ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత.
هُوَ ٱللَّهُ ٱلَّذِي لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡمَلِكُ ٱلۡقُدُّوسُ ٱلسَّلَٰمُ ٱلۡمُؤۡمِنُ ٱلۡمُهَيۡمِنُ ٱلۡعَزِيزُ ٱلۡجَبَّارُ ٱلۡمُتَكَبِّرُۚ سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يُشۡرِكُونَ
ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు, శాంతి ప్రదాత, శరణమిచ్చేవాడు, సర్వశక్తిమంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు. (a)
هُوَ ٱللَّهُ ٱلۡخَٰلِقُ ٱلۡبَارِئُ ٱلۡمُصَوِّرُۖ لَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰۚ يُسَبِّحُ لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ
ఆయనే, అల్లాహ్! విశ్వసృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి.(a) ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
مشاركة عبر