Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad
Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu oleh Maulana Abdurrahim bin Muhammad.
تَبَارَكَ ٱلَّذِي نَزَّلَ ٱلۡفُرۡقَانَ عَلَىٰ عَبۡدِهِۦ لِيَكُونَ لِلۡعَٰلَمِينَ نَذِيرًا
సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు!(a)
ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَمۡ يَتَّخِذۡ وَلَدٗا وَلَمۡ يَكُن لَّهُۥ شَرِيكٞ فِي ٱلۡمُلۡكِ وَخَلَقَ كُلَّ شَيۡءٖ فَقَدَّرَهُۥ تَقۡدِيرٗا
భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు(a). విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు(b).
وَٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗ لَّا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ وَلَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا وَلَا يَمۡلِكُونَ مَوۡتٗا وَلَا حَيَوٰةٗ وَلَا نُشُورٗا
అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.
وَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّآ إِفۡكٌ ٱفۡتَرَىٰهُ وَأَعَانَهُۥ عَلَيۡهِ قَوۡمٌ ءَاخَرُونَۖ فَقَدۡ جَآءُو ظُلۡمٗا وَزُورٗا
మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం ఒక బూటక కల్పన; దీనిని ఇతనే కల్పించాడు. మరియు ఇతర జాతివారు కొందరు, ఇతనికి ఈ పనిలో సహాయపడ్డారు(a). కాని వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు."
وَقَالُوٓاْ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ٱكۡتَتَبَهَا فَهِيَ تُمۡلَىٰ عَلَيۡهِ بُكۡرَةٗ وَأَصِيلٗا
మరియు వారింకా ఇలా అంటారు: "ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను వ్రాసుకున్నాడు, ఇవి ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి వ్రాయించబడుతున్నాయి(a)."
قُلۡ أَنزَلَهُ ٱلَّذِي يَعۡلَمُ ٱلسِّرَّ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ إِنَّهُۥ كَانَ غَفُورٗا رَّحِيمٗا
వారితో ఇలా అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) భూమ్యాకాశాల రహస్యాలు తెలిసిన వాడు అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
وَقَالُواْ مَالِ هَٰذَا ٱلرَّسُولِ يَأۡكُلُ ٱلطَّعَامَ وَيَمۡشِي فِي ٱلۡأَسۡوَاقِ لَوۡلَآ أُنزِلَ إِلَيۡهِ مَلَكٞ فَيَكُونَ مَعَهُۥ نَذِيرًا
మరియు వారిలా అంటారు: "ఇతను ఎటువంటి సందేశహరుడు, (సాధారణ వ్యక్తివలే) ఇతనూ అన్నం తింటున్నాడు మరియు వీధులలో తిరుగుతున్నాడు? (ఇతను వాస్తవంగానే దైవప్రవక్త అయితే) ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడిగా, ఒక దేవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?(a)"
أَوۡ يُلۡقَىٰٓ إِلَيۡهِ كَنزٌ أَوۡ تَكُونُ لَهُۥ جَنَّةٞ يَأۡكُلُ مِنۡهَاۚ وَقَالَ ٱلظَّٰلِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلٗا مَّسۡحُورًا
లేదా ఇతనికొక నిధి ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికొక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను దాని నుండి తినటానికి!" ఆ దుర్మార్గులు ఇంకా ఇలా అంటారు :"మీరు కేవలం ఒక మంత్రజాలానికి గురి అయిన మానవుణ్ణి అనుసరిస్తున్నారు."
ٱنظُرۡ كَيۡفَ ضَرَبُواْ لَكَ ٱلۡأَمۡثَٰلَ فَضَلُّواْ فَلَا يَسۡتَطِيعُونَ سَبِيلٗا
(ఓ ప్రవక్తా!) చూడు వారు నిన్ను గురించి ఎటువంటి ఉదాహరణలు ఇస్తున్నారు? వారు మార్గభ్రష్టులై పోయారు, వారు ఋజుమార్గం పొందజాలరు.
تَبَارَكَ ٱلَّذِيٓ إِن شَآءَ جَعَلَ لَكَ خَيۡرٗا مِّن ذَٰلِكَ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ وَيَجۡعَل لَّكَ قُصُورَۢا
ఆ శుభదాయకుడు కోరితే నీకు వాటి కంటే ఉత్తమమైన వాటిని ప్రసాదించగలడు - స్వర్గవనాలు - వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి మరియు అక్కడ నీ కొరకు పెద్ద కోటలు కూడా ఉంటాయి.
بَلۡ كَذَّبُواْ بِٱلسَّاعَةِۖ وَأَعۡتَدۡنَا لِمَن كَذَّبَ بِٱلسَّاعَةِ سَعِيرًا
వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు. మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించే వారి కొరకు మేము జ్వలించే నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాము.
إِذَا رَأَتۡهُم مِّن مَّكَانِۭ بَعِيدٖ سَمِعُواْ لَهَا تَغَيُّظٗا وَزَفِيرٗا
అది, దూరం నుండి వారిని చూసినప్పుడు వారు దాని ఆవేశ ధ్వనులను మరియు దాని బుసను వింటారు(a).
وَإِذَآ أُلۡقُواْ مِنۡهَا مَكَانٗا ضَيِّقٗا مُّقَرَّنِينَ دَعَوۡاْ هُنَالِكَ ثُبُورٗا
మరియు దానిలోని ఒక ఇరుకైన స్థలంలో, వారు బంధింపబడి, త్రోయబడినప్పుడు వారక్కడ తమ చావును పిలువడం ప్రారంభిస్తారు(a).
لَّا تَدۡعُواْ ٱلۡيَوۡمَ ثُبُورٗا وَٰحِدٗا وَٱدۡعُواْ ثُبُورٗا كَثِيرٗا
వారితో అనబడుతుంది: "ఈ రోజు మీరు ఒక్క చావును పిలువకండి, ఎన్నో చావుల కొరకు అరవండి!"
قُلۡ أَذَٰلِكَ خَيۡرٌ أَمۡ جَنَّةُ ٱلۡخُلۡدِ ٱلَّتِي وُعِدَ ٱلۡمُتَّقُونَۚ كَانَتۡ لَهُمۡ جَزَآءٗ وَمَصِيرٗا
వారితో అను: "ఏమీ? ఇది మంచిదా, లేతా దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గమా? అదే (దైవభీతి గల) వారి ప్రతిఫలం మరియు గమ్యస్థానం.
لَّهُمۡ فِيهَا مَا يَشَآءُونَ خَٰلِدِينَۚ كَانَ عَلَىٰ رَبِّكَ وَعۡدٗا مَّسۡـُٔولٗا
అందులో వారికి వారు కోరింది లభిస్తుంది. వారందు శాశ్వతంగా వుంటారు. ఇది నీ ప్రభువు కర్తవ్యంతో పూర్తి చేయవలసిన వాగ్దానం.
وَيَوۡمَ يَحۡشُرُهُمۡ وَمَا يَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ فَيَقُولُ ءَأَنتُمۡ أَضۡلَلۡتُمۡ عِبَادِي هَٰٓؤُلَآءِ أَمۡ هُمۡ ضَلُّواْ ٱلسَّبِيلَ
మరియు ఆయన (అల్లాహ్) వారిని (సత్యతిరస్కారులను) మరియు అల్లాహ్ కు బదులుగా వారు ఆరాధించేవారిని, అందరినీ, ఆ రోజు సమావేశపరచి వారితో ఇలా అంటాడు: " ఏమీ? మీరేనా నా దాసులను మార్గం తప్పించిన వారు? లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా?"
قَالُواْ سُبۡحَٰنَكَ مَا كَانَ يَنۢبَغِي لَنَآ أَن نَّتَّخِذَ مِن دُونِكَ مِنۡ أَوۡلِيَآءَ وَلَٰكِن مَّتَّعۡتَهُمۡ وَءَابَآءَهُمۡ حَتَّىٰ نَسُواْ ٱلذِّكۡرَ وَكَانُواْ قَوۡمَۢا بُورٗا
వారంటారు: "ఓ మా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు! మేము నిన్ను వదలి ఇతరులను మా సంరక్షకులుగా చేసుకోవటం మాకు తగినది కాదు, కాని నీవు వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా సుఖసంతోషాలను ప్రసాదించావు, చివరకు వారు నీ బోధననే మరచి పోయి నాశనానికి గురి అయిన వారయ్యారు."
فَقَدۡ كَذَّبُوكُم بِمَا تَقُولُونَ فَمَا تَسۡتَطِيعُونَ صَرۡفٗا وَلَا نَصۡرٗاۚ وَمَن يَظۡلِم مِّنكُمۡ نُذِقۡهُ عَذَابٗا كَبِيرٗا
(అప్పుడు అల్లాహ్ అంటాడు): "కాని ఇప్పడైతే వారు, మీ మాటలను అసత్యాలని తిరస్కరిస్తున్నారు. ఇక మీరు మీ శిక్ష నుండి తప్పించుకోలేరు మరియు ఎలాంటి సహాయమూ పొందలేరు. మరియు మీలో దుర్మార్గానికి పాల్పడిన వానికి మేము ఘోరశిక్ష రుచి చూపుతాము!"
وَمَآ أَرۡسَلۡنَا قَبۡلَكَ مِنَ ٱلۡمُرۡسَلِينَ إِلَّآ إِنَّهُمۡ لَيَأۡكُلُونَ ٱلطَّعَامَ وَيَمۡشُونَ فِي ٱلۡأَسۡوَاقِۗ وَجَعَلۡنَا بَعۡضَكُمۡ لِبَعۡضٖ فِتۡنَةً أَتَصۡبِرُونَۗ وَكَانَ رَبُّكَ بَصِيرٗا
మరియు (ఓ ముహమ్మద్!) మేము నీకు పూర్వం పంపిన సందేశహరులు అందరూ నిశ్చయంగా, ఆహారం తినేవారే, వీధులలో సంచరించేవారే. మరియు మేము మిమ్మల్ని ఒకరిని మరొకరి కొరకు పరీక్షా సాధనాలుగా చేశాము; ఏమీ? మీరు(a) సహనం వహిస్తారా? మరియు వాస్తవానికి, నీ ప్రభువు సర్వం చూసేవాడు(b).
۞ وَقَالَ ٱلَّذِينَ لَا يَرۡجُونَ لِقَآءَنَا لَوۡلَآ أُنزِلَ عَلَيۡنَا ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ نَرَىٰ رَبَّنَاۗ لَقَدِ ٱسۡتَكۡبَرُواْ فِيٓ أَنفُسِهِمۡ وَعَتَوۡ عُتُوّٗا كَبِيرٗا
మరియు మమ్మల్ని కలుసుకోవలసి ఉందని ఆశించనివారు ఇలా అన్నారు: "దేవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడలేదు? లేదా మేము మా ప్రభువును ఎందుకు చూడలేము?" వాస్తవానికి, వారు తమను తాము చాలా గొప్పవారిగా భావించారు మరియు వారు తలబిరుసుతనంలో చాలా మితిమీరి పోయారు(a).
يَوۡمَ يَرَوۡنَ ٱلۡمَلَٰٓئِكَةَ لَا بُشۡرَىٰ يَوۡمَئِذٖ لِّلۡمُجۡرِمِينَ وَيَقُولُونَ حِجۡرٗا مَّحۡجُورٗا
ఆ రోజు(a) వారు దేవదూతలను చూస్తారు; ఆరోజు అపరాధులకు ఎలాంటి శుభవార్తలు ఉండవు మరియు వారు (దేవదూతలు) ఇలా అంటారు: "మీకు శుభవార్తలన్నీ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి."
وَقَدِمۡنَآ إِلَىٰ مَا عَمِلُواْ مِنۡ عَمَلٖ فَجَعَلۡنَٰهُ هَبَآءٗ مَّنثُورًا
మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము(a).
أَصۡحَٰبُ ٱلۡجَنَّةِ يَوۡمَئِذٍ خَيۡرٞ مُّسۡتَقَرّٗا وَأَحۡسَنُ مَقِيلٗا
ఆ దినమున స్వర్గానికి అర్హులైన వారు మంచి నివాసంలో మరియు ఉత్తమ విశ్రాంతి స్థలంలో ఉంటారు.
وَيَوۡمَ تَشَقَّقُ ٱلسَّمَآءُ بِٱلۡغَمَٰمِ وَنُزِّلَ ٱلۡمَلَٰٓئِكَةُ تَنزِيلًا
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆకాశం మేఘాలతో సహా బ్రద్దలు చేయబడుతుంది. మరియు దేవదూతలు వరుసగా దింపబడతారు(a).
ٱلۡمُلۡكُ يَوۡمَئِذٍ ٱلۡحَقُّ لِلرَّحۡمَٰنِۚ وَكَانَ يَوۡمًا عَلَى ٱلۡكَٰفِرِينَ عَسِيرٗا
ఆ రోజు వాస్తవమైన విశ్వ సామ్రాజ్యాధిపత్యం కేవలం ఆ అనంత కరుణామయునిదే! సత్యతిరస్కారులకు ఆ దినం ఎంతో కఠినమైనదిగా ఉంటుంది.
وَيَوۡمَ يَعَضُّ ٱلظَّالِمُ عَلَىٰ يَدَيۡهِ يَقُولُ يَٰلَيۡتَنِي ٱتَّخَذۡتُ مَعَ ٱلرَّسُولِ سَبِيلٗا
మరియు (జ్ఞాపకముంచుకోండి), ఆ దినమున దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: "అయ్యో! నేను సందేశహరుని మార్గం అనుసరిస్తే, ఎంత బాగుండేది!"
يَٰوَيۡلَتَىٰ لَيۡتَنِي لَمۡ أَتَّخِذۡ فُلَانًا خَلِيلٗا
"అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ఫలానా వానిని స్నేహితునిగా చేసుకోకుండా వుంటే ఎంత బాగుండేది(a)!"
لَّقَدۡ أَضَلَّنِي عَنِ ٱلذِّكۡرِ بَعۡدَ إِذۡ جَآءَنِيۗ وَكَانَ ٱلشَّيۡطَٰنُ لِلۡإِنسَٰنِ خَذُولٗا
"వాస్తవానికి అతడే, హితబోధ (ఖుర్ఆన్) నా వద్దకు వచ్చిన తరువాత కూడా, నన్ను దాని నుండి తప్పించాడు! వాస్తవానికి షైతాన్ మానవుని యెడల నమ్మకద్రోహి(a)."
وَقَالَ ٱلرَّسُولُ يَٰرَبِّ إِنَّ قَوۡمِي ٱتَّخَذُواْ هَٰذَا ٱلۡقُرۡءَانَ مَهۡجُورٗا
అప్పుడు సందేశహరుడు ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా జాతివారు ఈ ఖుర్ఆన్ ను పూర్తిగా వదలి పెట్టారు(a)."
وَكَذَٰلِكَ جَعَلۡنَا لِكُلِّ نَبِيٍّ عَدُوّٗا مِّنَ ٱلۡمُجۡرِمِينَۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيٗا وَنَصِيرٗا
మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకూ శత్రువులను నియమించాము(a). మరియు నీ ప్రభువే, నీకు మార్గదర్శకుడిగా మరియు సహాయకుడిగా చాలు!
وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ ٱلۡقُرۡءَانُ جُمۡلَةٗ وَٰحِدَةٗۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِۦ فُؤَادَكَۖ وَرَتَّلۡنَٰهُ تَرۡتِيلٗا
మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" మేము (ఈ ఖుర్ఆన్ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము(a).
وَلَا يَأۡتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئۡنَٰكَ بِٱلۡحَقِّ وَأَحۡسَنَ تَفۡسِيرًا
మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము(a).
ٱلَّذِينَ يُحۡشَرُونَ عَلَىٰ وُجُوهِهِمۡ إِلَىٰ جَهَنَّمَ أُوْلَٰٓئِكَ شَرّٞ مَّكَانٗا وَأَضَلُّ سَبِيلٗا
ఎవరైతే, వారి ముఖాల మీద (బోర్లా పడవేయబడి) లాగుతూ నరకంలో కూడబెట్ట బడతారో, అలాంటి వారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు(a).
وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ وَجَعَلۡنَا مَعَهُۥٓ أَخَاهُ هَٰرُونَ وَزِيرٗا
మరియు నిశ్చయంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము మరియు అతని సోదరుడైన హారూన్ ను అతనికి సహాయకునిగా చేశాము(a).
فَقُلۡنَا ٱذۡهَبَآ إِلَى ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا فَدَمَّرۡنَٰهُمۡ تَدۡمِيرٗا
వారిద్దరితో ఇలా అన్నాము: "మీరిద్దరూ మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జాతి వారి వద్దకు వెళ్ళండి." తరువాత మేము (ఆ జాతి) వారిని పూర్తిగా నాశనం చేశాము.
وَقَوۡمَ نُوحٖ لَّمَّا كَذَّبُواْ ٱلرُّسُلَ أَغۡرَقۡنَٰهُمۡ وَجَعَلۡنَٰهُمۡ لِلنَّاسِ ءَايَةٗۖ وَأَعۡتَدۡنَا لِلظَّٰلِمِينَ عَذَابًا أَلِيمٗا
ఇక నూహ్ జాతి వారు: ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారో, మేము వారిని ముంచి వేసి, సర్వజనులకు వారిని ఒక సూచనగా చేశాము. మరియు దుర్మార్గుల కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధ పరిచి ఉంచాము.
وَعَادٗا وَثَمُودَاْ وَأَصۡحَٰبَ ٱلرَّسِّ وَقُرُونَۢا بَيۡنَ ذَٰلِكَ كَثِيرٗا
మరియు ఇదే విధంగా ఆద్ మరియు సమూద్ మరియు అర్ రస్స్(a) ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాల వారిని(b) (నాశనం చేశాము).
وَكُلّٗا ضَرَبۡنَا لَهُ ٱلۡأَمۡثَٰلَۖ وَكُلّٗا تَبَّرۡنَا تَتۡبِيرٗا
మరియు వారిలో ప్రతి ఒక్కరినీ మేము దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము. చివరకు ప్రతి ఒక్కరినీ పూర్తిగా నిర్మూలించాము(a).
وَلَقَدۡ أَتَوۡاْ عَلَى ٱلۡقَرۡيَةِ ٱلَّتِيٓ أُمۡطِرَتۡ مَطَرَ ٱلسَّوۡءِۚ أَفَلَمۡ يَكُونُواْ يَرَوۡنَهَاۚ بَلۡ كَانُواْ لَا يَرۡجُونَ نُشُورٗا
మరియు మేము దారుణమైన (రాళ్ళ) వర్షం కురిపించిన (లూత్) నగరం మీద నుండి వాస్తవానికి వారు (అవిశ్వాసులు) ప్రయాణం చేసి ఉంటారు. ఏమీ? వారు దానిని (దాని స్థితిని) చూడటం లేదా? వాస్తవానికి, వారు తిరిగి బ్రతికించి లేపబడతారని నమ్మలేదు(a).
وَإِذَا رَأَوۡكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا ٱلَّذِي بَعَثَ ٱللَّهُ رَسُولًا
(ఓ ముహమ్మద్!) వారు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను పరిహాసాలనికి గురి చేస్తూ ఇలా అంటారు: "ఏమీ? ఇతనినేనా, అల్లాహ్ తన సందేశహరునిగా చేసి పంపింది?
إِن كَادَ لَيُضِلُّنَا عَنۡ ءَالِهَتِنَا لَوۡلَآ أَن صَبَرۡنَا عَلَيۡهَاۚ وَسَوۡفَ يَعۡلَمُونَ حِينَ يَرَوۡنَ ٱلۡعَذَابَ مَنۡ أَضَلُّ سَبِيلًا
మేము వాటి (మా దేవతల) పట్ల (దృఢవిశ్వాసం మీద) స్థిరంగా ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవతల నుండి తప్పించి దూరం చేసేవాడే!" మరియు త్వరలోనే వారు మా శిక్షను చూసినప్పుడు ఎవరు మార్గం తప్పి ఉన్నారో తెలుసుకుంటారు(a).
أَرَءَيۡتَ مَنِ ٱتَّخَذَ إِلَٰهَهُۥ هَوَىٰهُ أَفَأَنتَ تَكُونُ عَلَيۡهِ وَكِيلًا
(ఓ ముహమ్మద్!) ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో, అలాంటి వానిని నీవు చూశావా? నీవు అలాంటి వానికి రక్షకుడవు కాగలవా?
أَمۡ تَحۡسَبُ أَنَّ أَكۡثَرَهُمۡ يَسۡمَعُونَ أَوۡ يَعۡقِلُونَۚ إِنۡ هُمۡ إِلَّا كَٱلۡأَنۡعَٰمِ بَلۡ هُمۡ أَضَلُّ سَبِيلًا
లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు! వారు వాటి కంటే ఎక్కువ దాని తప్పిన వారు.
أَلَمۡ تَرَ إِلَىٰ رَبِّكَ كَيۡفَ مَدَّ ٱلظِّلَّ وَلَوۡ شَآءَ لَجَعَلَهُۥ سَاكِنٗا ثُمَّ جَعَلۡنَا ٱلشَّمۡسَ عَلَيۡهِ دَلِيلٗا
ఏమీ? నీవు చూడటం లేదా? నీ ప్రభువు! ఏ విధంగా ఛాయను పొడిగిస్తాడో? ఒకవేళ ఆయన కోరితే, దానిని నిలిపివేసి ఉండేవాడు, కాని మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శిగా చేశాము.
ثُمَّ قَبَضۡنَٰهُ إِلَيۡنَا قَبۡضٗا يَسِيرٗا
తరువాత మేము దానిని (ఆ నీడను) క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటాము.
وَهُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلَّيۡلَ لِبَاسٗا وَٱلنَّوۡمَ سُبَاتٗا وَجَعَلَ ٱلنَّهَارَ نُشُورٗا
మరియు ఆయన (అల్లాహ్) యే మీ కొరకు రాత్రిని వస్త్రంగానూ (తెరగానూ), నిద్రను విశ్రాంతి స్థితిగానూ మరియు పగటిని తిరిగి బ్రతికించి లేపబడే (జీవనోపాధి) సమయంగానూ చేశాడు.
وَهُوَ ٱلَّذِيٓ أَرۡسَلَ ٱلرِّيَٰحَ بُشۡرَۢا بَيۡنَ يَدَيۡ رَحۡمَتِهِۦۚ وَأَنزَلۡنَا مِنَ ٱلسَّمَآءِ مَآءٗ طَهُورٗا
మరియు ఆయన (అల్లాహ్) యే తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలుగా పంపేవాడు మరియు మేమే ఆకాశం నుండి నిర్మలమైన నీటిని కురిపించే వారము.
لِّنُحۡـِۧيَ بِهِۦ بَلۡدَةٗ مَّيۡتٗا وَنُسۡقِيَهُۥ مِمَّا خَلَقۡنَآ أَنۡعَٰمٗا وَأَنَاسِيَّ كَثِيرٗا
దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోయటానికి మరియు దానిని మేము సృష్టించిన ఎన్నో పశువులకు మరియు మానవులకు త్రాగటానికి!
وَلَقَدۡ صَرَّفۡنَٰهُ بَيۡنَهُمۡ لِيَذَّكَّرُواْ فَأَبَىٰٓ أَكۡثَرُ ٱلنَّاسِ إِلَّا كُفُورٗا
మరియు వాస్తవానికి, మేము దానిని (నీటిని) వారి మధ్య పంచాము, వారు (మా అనుగ్రహాన్ని) జ్ఞాపకముంచుకోవాలని; కానీ మానవులలో చాలా మంది దీనిని తిరస్కరించి, కృతఘ్నులవుతున్నారు.
وَلَوۡ شِئۡنَا لَبَعَثۡنَا فِي كُلِّ قَرۡيَةٖ نَّذِيرٗا
మరియు మేము తలుచుకుంటే, ప్రతి నగరానికొక హెచ్చరిక చేసేవానిని (ప్రవక్తను) పంపి ఉండేవారము.
فَلَا تُطِعِ ٱلۡكَٰفِرِينَ وَجَٰهِدۡهُم بِهِۦ جِهَادٗا كَبِيرٗا
కావున నీవు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు దీని (ఈ ఖుర్ఆన్) సహాయంతో, (వారికి హితబోధ చేయటానికి) గట్టిగా పాటుపడు.
۞ وَهُوَ ٱلَّذِي مَرَجَ ٱلۡبَحۡرَيۡنِ هَٰذَا عَذۡبٞ فُرَاتٞ وَهَٰذَا مِلۡحٌ أُجَاجٞ وَجَعَلَ بَيۡنَهُمَا بَرۡزَخٗا وَحِجۡرٗا مَّحۡجُورٗا
మరియు రెండు సముద్రాలను కలిపి ఉంచిన వాడు ఆయనే! ఒకటేమో రుచికరమైనది, దాహం తీర్చునది, మరొకటేమో ఉప్పగనూ, చేదుగనూ ఉన్నది మరియు ఆయన ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెరను - అవి కలిసి పోకుండా - అవరోధంగా ఏర్పరచాడు(a).
وَهُوَ ٱلَّذِي خَلَقَ مِنَ ٱلۡمَآءِ بَشَرٗا فَجَعَلَهُۥ نَسَبٗا وَصِهۡرٗاۗ وَكَانَ رَبُّكَ قَدِيرٗا
మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు(a). తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) సమర్ధుడు.
وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُهُمۡ وَلَا يَضُرُّهُمۡۗ وَكَانَ ٱلۡكَافِرُ عَلَىٰ رَبِّهِۦ ظَهِيرٗا
మరియు వారు అల్లాహ్ ను వదలి తమకు లాభం గానీ, నష్టం గానీ, చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. మరియు సత్యతిరస్కారుడు తన ప్రభువుకు విరుద్ధంగా, (షైతానుకు తోడుగా) ఉంటాడు.
وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا مُبَشِّرٗا وَنَذِيرٗا
మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను ఒక శుభవార్తాహరునిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.
قُلۡ مَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍ إِلَّا مَن شَآءَ أَن يَتَّخِذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلٗا
కావున నీవు వారితో అను: "దీనికై (ఈ ప్రచారానికై) మీతో ఎలాంటి ప్రతిఫలము నడగటం లేదు. కేవలం, తాను కోరిన వ్యక్తియే తన ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు!"
وَتَوَكَّلۡ عَلَى ٱلۡحَيِّ ٱلَّذِي لَا يَمُوتُ وَسَبِّحۡ بِحَمۡدِهِۦۚ وَكَفَىٰ بِهِۦ بِذُنُوبِ عِبَادِهِۦ خَبِيرًا
కావున ఎన్నడూ మరణించని, ఆ సజీవుని (నిత్యుని) పైననే ఆధారపడి ఉండు మరియు ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను ఎరుగుటకు ఆయనే చాలు.
ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ ٱلرَّحۡمَٰنُ فَسۡـَٔلۡ بِهِۦ خَبِيرٗا
ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తరువాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు(a). ఆయన అనంత కరుణా మయుడు, ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు.
وَإِذَا قِيلَ لَهُمُ ٱسۡجُدُواْۤ لِلرَّحۡمَٰنِ قَالُواْ وَمَا ٱلرَّحۡمَٰنُ أَنَسۡجُدُ لِمَا تَأۡمُرُنَا وَزَادَهُمۡ نُفُورٗا۩
మరియు వారితో: "ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి." అని అన్నప్పుడల్లా, వారంటారు: "ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగం (సజ్దా) చేయాలా?" మరియు అది (నీ పిలుపు) వారి వ్యతిరేకతను మరింత అధికమే చేసింది(a).
تَبَارَكَ ٱلَّذِي جَعَلَ فِي ٱلسَّمَآءِ بُرُوجٗا وَجَعَلَ فِيهَا سِرَٰجٗا وَقَمَرٗا مُّنِيرٗا
ఆకాశంలో నక్షత్రరాసులను (బురూజులను)(a) నిర్మించి అందులో ఒక (ప్రకాశించే) సూర్యుణ్ణి(b) మరియు వెలుగునిచ్చే (ప్రతిబింబింప జేసే) చంద్రుణ్ణి నియమించిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు.
وَهُوَ ٱلَّذِي جَعَلَ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ خِلۡفَةٗ لِّمَنۡ أَرَادَ أَن يَذَّكَّرَ أَوۡ أَرَادَ شُكُورٗا
మరియు ఆయనే, రేయింబవళ్ళను ఒకదాని వెంట ఒకటి అనుక్రమంగా వచ్చేటట్లు చేసేవాడు, ఇవన్నీ గమనించ గోరిన వారి కొరకు లేదా కృతజ్ఞత చూపగోరిన వారి కొరకు ఉన్నాయి.
وَعِبَادُ ٱلرَّحۡمَٰنِ ٱلَّذِينَ يَمۡشُونَ عَلَى ٱلۡأَرۡضِ هَوۡنٗا وَإِذَا خَاطَبَهُمُ ٱلۡجَٰهِلُونَ قَالُواْ سَلَٰمٗا
మరియు వారే, అనంత కరుణామయుని దాసులు, ఎవరైతే భూమి మీద నమ్రతతో నడుస్తారో! మరియు మూర్ఖులు వారిని పలుకరించి నప్పుడు: "మీకు సలాం!"(a) అని అంటారో!
وَٱلَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمۡ سُجَّدٗا وَقِيَٰمٗا
మరియు ఎవరైతే, తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు (నమాజ్ లో) నిలబడుతూ రాత్రులు గడుపుతారో!
وَٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَا ٱصۡرِفۡ عَنَّا عَذَابَ جَهَنَّمَۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا
మరియు ఎవరైతే: "ఓ మా ప్రభూ! మా నుండి నరకపు శిక్షను తొలగించు. నిశ్చయంగా, దాని శిక్ష ఎడతెగని పీడన" అని అంటారో!(a)
إِنَّهَا سَآءَتۡ مُسۡتَقَرّٗا وَمُقَامٗا
నిశ్చయంగా, అది అతి చెడ్డ ఆశ్రయం మరియు నివాస స్థలం.
وَٱلَّذِينَ إِذَآ أَنفَقُواْ لَمۡ يُسۡرِفُواْ وَلَمۡ يَقۡتُرُواْ وَكَانَ بَيۡنَ ذَٰلِكَ قَوَامٗا
మరియు ఎవరైతే ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చు గానీ లేక లోభత్వం గానీ చేయకుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో;
وَٱلَّذِينَ لَا يَدۡعُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ وَلَا يَقۡتُلُونَ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّ وَلَا يَزۡنُونَۚ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ يَلۡقَ أَثَامٗا
మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో(a)! మరియు వ్యభిచారానికి పాల్పబడరో(b). మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.
يُضَٰعَفۡ لَهُ ٱلۡعَذَابُ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَيَخۡلُدۡ فِيهِۦ مُهَانًا
పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు.
إِلَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ عَمَلٗا صَٰلِحٗا فَأُوْلَٰٓئِكَ يُبَدِّلُ ٱللَّهُ سَيِّـَٔاتِهِمۡ حَسَنَٰتٖۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا
కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు(a). మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
وَمَن تَابَ وَعَمِلَ صَٰلِحٗا فَإِنَّهُۥ يَتُوبُ إِلَى ٱللَّهِ مَتَابٗا
మరియు ఎవడైతే, పశ్చాత్తాప పడి సత్కార్యాలు చేస్తాడో! నిశ్చయంగా అలాంటి వాడు హృదయపూర్వకంగా అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు!
وَٱلَّذِينَ لَا يَشۡهَدُونَ ٱلزُّورَ وَإِذَا مَرُّواْ بِٱللَّغۡوِ مَرُّواْ كِرَامٗا
మరియు ఎవరైతే, అబద్ధమైన సాక్ష్యం ఇవ్వరో! మరియు వ్యర్థమైన పనుల వైపు నుండి పోవటం జరిగితే, సంస్కారవంతులుగా అక్కడి నుండి దాటిపోతారో(a)!
وَٱلَّذِينَ إِذَا ذُكِّرُواْ بِـَٔايَٰتِ رَبِّهِمۡ لَمۡ يَخِرُّواْ عَلَيۡهَا صُمّٗا وَعُمۡيَانٗا
మరియు ఎవరైతే, తమ ప్రభువు సూచనల (ఆయాత్ ల) హితబోధ చేసినపుడు, వారు దానికి చెవిటివారిగా మరియు గ్రుడ్డివారిగా ఉండిపోరో!
وَٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبۡ لَنَا مِنۡ أَزۡوَٰجِنَا وَذُرِّيَّٰتِنَا قُرَّةَ أَعۡيُنٖ وَٱجۡعَلۡنَا لِلۡمُتَّقِينَ إِمَامًا
మరియు ఎవరైతే, ఇలా ప్రార్థిస్తారో: "ఓ మా ప్రభూ! మా సహవాసుల (అజ్వాజ్ ల) మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. మరియు మమ్మల్ని దైవభీతి గలవారికి నాయకులుగా (ఇమాములుగా) చేయి."
أُوْلَٰٓئِكَ يُجۡزَوۡنَ ٱلۡغُرۡفَةَ بِمَا صَبَرُواْ وَيُلَقَّوۡنَ فِيهَا تَحِيَّةٗ وَسَلَٰمًا
ఇలాంటి వారే తమ సహనశీలతకు ప్రతిఫలంగా (స్వర్గంలో) ఉన్నత స్థానాన్ని పొందేవారు. అక్కడ వారికి గౌరవమైన స్వాగతం మరియు శాంతి లభిస్తాయి.
خَٰلِدِينَ فِيهَاۚ حَسُنَتۡ مُسۡتَقَرّٗا وَمُقَامٗا
వారందు శాశ్వతంగా ఉంటారు. అది ఎంత మంచి నివాసం మరియు ఎంత మంచి స్థలం.
قُلۡ مَا يَعۡبَؤُاْ بِكُمۡ رَبِّي لَوۡلَا دُعَآؤُكُمۡۖ فَقَدۡ كَذَّبۡتُمۡ فَسَوۡفَ يَكُونُ لِزَامَۢا
(ఓ ముహమ్మద్! అవిశ్వాసులతో) ఇలా అను: "మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు(a). కాని వాస్తవానికి, ఇప్పుడు మీరు (ఆయనను) తిరస్కరించారు. కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది."
مشاركة عبر