Header Include

テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

クルアーン・テルグ語対訳 - Maulana Abder-Rahim ibn Muhammad

QR Code https://quran.islamcontent.com/ja/telugu_muhammad

طسٓمٓ

తా - సీన్ - మీమ్.

తా - సీన్ - మీమ్.

تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ ٱلۡمُبِينِ

ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)

ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)

لَعَلَّكَ بَٰخِعٞ نَّفۡسَكَ أَلَّا يَكُونُواْ مُؤۡمِنِينَ

(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో!(a)

(a) ఇటువంటి ఆయత్ కు చూడండి, 18:6.
(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో!(a)

إِن نَّشَأۡ نُنَزِّلۡ عَلَيۡهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةٗ فَظَلَّتۡ أَعۡنَٰقُهُمۡ لَهَا خَٰضِعِينَ

మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము.

وَمَا يَأۡتِيهِم مِّن ذِكۡرٖ مِّنَ ٱلرَّحۡمَٰنِ مُحۡدَثٍ إِلَّا كَانُواْ عَنۡهُ مُعۡرِضِينَ

మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు.

فَقَدۡ كَذَّبُواْ فَسَيَأۡتِيهِمۡ أَنۢبَٰٓؤُاْ مَا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ

వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.(a)

(a) చూడండి, 6:4-5.
వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.(a)

أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلۡأَرۡضِ كَمۡ أَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ زَوۡجٖ كَرِيمٍ

ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని)(a) పుట్టించామో?

(a) 'జౌజున్: అంటే ఇక్కడ వివిధరకాలు అని అర్థం.
ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని)(a) పుట్టించామో?

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

وَإِذۡ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئۡتِ ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ

మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;(a)

(a) మూసా ('అ.స.) తన పరివారంతో సహా తిరిగి ఈజిప్టుకు వస్తున్నప్పుడు అతనికి ఒక వెలుగు కనిపిస్తుంది. అతను దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆదేశం వస్తుంది.
మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;(a)

قَوۡمَ فِرۡعَوۡنَۚ أَلَا يَتَّقُونَ

ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?"

قَالَ رَبِّ إِنِّيٓ أَخَافُ أَن يُكَذِّبُونِ

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.(a)

(a) దీనితో తెలిసేదేమిటంటే సాధారణ మానవుల వలె, దైవప్రవక్తలకు కూడా సహజమైన భయం కలగవచ్చు.
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.(a)

وَيَضِيقُ صَدۡرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرۡسِلۡ إِلَىٰ هَٰرُونَ

నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది(a), కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.

(a) దీనికి కారణం అతని నాలుకలో ఉన్న ముడి ('ఉఖ్ దతున్) చూడండి, 20:25-34.
నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది(a), కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.

وَلَهُمۡ عَلَيَّ ذَنۢبٞ فَأَخَافُ أَن يَقۡتُلُونِ

మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది(a), కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."

(a) ఇది మూసా ('అ.స.) ఈజిప్టు నుండి వెళ్ళకముందు అనుకోకుండా జరిగిన సంఘటన. ఒక ఫిర్'ఔన్ జాతివాడు, ఒక ఇస్రాయీ'ల్ జాతివానితో కలహిస్తూ ఉండగా - ఇస్రాయీ'లు వాని పిలుపు విని - మూసా ('అ.స.) అతనికి సహాయపడటానికి, ఫిర్'ఔన్ జాతి వానిని ఒక దెబ్బ కొట్టడం వల్ల, అతడు మరణిస్తాడు. ఆ నేరానికి వారు అతనిని చంపగోరుతారు. (వివరాలకు చూడండి, 28:15).
మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది(a), కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."

قَالَ كَلَّاۖ فَٱذۡهَبَا بِـَٔايَٰتِنَآۖ إِنَّا مَعَكُم مُّسۡتَمِعُونَ

(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము(a).

(a) 'మీతోపాటు ఉండి.' అంటే అల్లాహ్ (సు.తా.) నేలపైకి ప్రతి మానవుని దగ్గరికి రాడు. ఆయన జ్ఞానం ప్రతి ఒక్కరితో ఉంటుంది. కాని అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ పైననే కూర్చుని ఉంటాడు. అంటే విశ్వంలో జరిగేది ఏది కూడా అల్లాహ్ (సు.తా.)కు తెలియకుండా లేదు.
(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము(a).

فَأۡتِيَا فِرۡعَوۡنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلۡعَٰلَمِينَ

కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము.

أَنۡ أَرۡسِلۡ مَعَنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ

కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు(a)."

(a) ఎందుకంటే నీవు నాలుగువందల సంవత్సరాలు వారిని బానిసలుగా చేసి ఉంచావు. ఇప్పుడు వారికి స్వేచ్ఛనివ్వు. నేను వారిని బైతుల్ మఖ్దిస్ వైపునకు తీసుకొని పోతాను.
కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు(a)."

قَالَ أَلَمۡ نُرَبِّكَ فِينَا وَلِيدٗا وَلَبِثۡتَ فِينَا مِنۡ عُمُرِكَ سِنِينَ

(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా!

وَفَعَلۡتَ فَعۡلَتَكَ ٱلَّتِي فَعَلۡتَ وَأَنتَ مِنَ ٱلۡكَٰفِرِينَ

అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"(a)

(a) చూడండి, 28:4-22, హీనమైన పని అంటే ఒక ఫిర్'ఔన్ జాతి వానిని దెబ్బకొట్టి చంపింది.
అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"(a)

قَالَ فَعَلۡتُهَآ إِذٗا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ

(మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను!

فَفَرَرۡتُ مِنكُمۡ لَمَّا خِفۡتُكُمۡ فَوَهَبَ لِي رَبِّي حُكۡمٗا وَجَعَلَنِي مِنَ ٱلۡمُرۡسَلِينَ

ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.(a)

(a) చూడండి, 28:15-16.
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.(a)

وَتِلۡكَ نِعۡمَةٞ تَمُنُّهَا عَلَيَّ أَنۡ عَبَّدتَّ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ

ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"(a)

(a) చూడండి, 28:4-5.
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"(a)

قَالَ فِرۡعَوۡنُ وَمَا رَبُّ ٱلۡعَٰلَمِينَ

(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"(a)

(a) ఫిర్'ఔన్ తన దురహంకారంలో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఈజిప్టు వాసులందరికీ అతడు, తానే దైవమని చెప్పి, తన ఆరాధ్యం చేయించుకునేవాడు. చూడండి, 28:38.
(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"(a)

قَالَ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَآۖ إِن كُنتُم مُّوقِنِينَ

(మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!"

قَالَ لِمَنۡ حَوۡلَهُۥٓ أَلَا تَسۡتَمِعُونَ

(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?"(a) అని ప్రశ్నించాడు.

(a) నేను తప్ప మీకు మరొక ప్రభువు కూడా ఉన్నాడా ?
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?"(a) అని ప్రశ్నించాడు.

قَالَ رَبُّكُمۡ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلۡأَوَّلِينَ

(మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ!"

قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِيٓ أُرۡسِلَ إِلَيۡكُمۡ لَمَجۡنُونٞ

(ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే!"

قَالَ رَبُّ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَمَا بَيۡنَهُمَآۖ إِن كُنتُمۡ تَعۡقِلُونَ

(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు(a)."

(a) చూడండి, 2:115.
(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు(a)."

قَالَ لَئِنِ ٱتَّخَذۡتَ إِلَٰهًا غَيۡرِي لَأَجۡعَلَنَّكَ مِنَ ٱلۡمَسۡجُونِينَ

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను."

قَالَ أَوَلَوۡ جِئۡتُكَ بِشَيۡءٖ مُّبِينٖ

(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"(a)

(a) చూడండి, 12:1.
(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"(a)

قَالَ فَأۡتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!"

فَأَلۡقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعۡبَانٞ مُّبِينٞ

అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది(a).

(a) జాన్నున్ (27:10, 28:31) అంటే - చిన్న సర్పం. సు' 'అబానున్ (7:107) అంటే - పెద్ద సర్పం. 'హయ్యతున్ (20:20) అంటే - చిన్నదీ కావచ్చు పెద్దదీ కావచ్చు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది(a).

وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِيَ بَيۡضَآءُ لِلنَّٰظِرِينَ

తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది!(a)

(a) చూడండి, 7:107, 20:22, 27:12, 28:38.
తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది!(a)

قَالَ لِلۡمَلَإِ حَوۡلَهُۥٓ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٞ

(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు.

يُرِيدُ أَن يُخۡرِجَكُم مِّنۡ أَرۡضِكُم بِسِحۡرِهِۦ فَمَاذَا تَأۡمُرُونَ

ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"(a)

(a) చూడండి, 7:109-110)
ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"(a)

قَالُوٓاْ أَرۡجِهۡ وَأَخَاهُ وَٱبۡعَثۡ فِي ٱلۡمَدَآئِنِ حَٰشِرِينَ

వారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు;

يَأۡتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٖ

వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు."

فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَٰتِ يَوۡمٖ مَّعۡلُومٖ

ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.(a)

(a) చూఇది అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛయే! ప్రజలకు, మూసా ('అ.స.) సత్యుడని మరియు మాంత్రికులు చేసేదంతా బూటక కల్పనలని నిరూపించటానికి. చూడండి, 21:18.
ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.(a)

وَقِيلَ لِلنَّاسِ هَلۡ أَنتُم مُّجۡتَمِعُونَ

మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా?

لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُواْ هُمُ ٱلۡغَٰلِبِينَ

ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!"

فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُواْ لِفِرۡعَوۡنَ أَئِنَّ لَنَا لَأَجۡرًا إِن كُنَّا نَحۡنُ ٱلۡغَٰلِبِينَ

మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"(a)

(a) చూడండి, 7:113.
మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"(a)

قَالَ نَعَمۡ وَإِنَّكُمۡ إِذٗا لَّمِنَ ٱلۡمُقَرَّبِينَ

(ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!"

قَالَ لَهُم مُّوسَىٰٓ أَلۡقُواْ مَآ أَنتُم مُّلۡقُونَ

మూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి!"

فَأَلۡقَوۡاْ حِبَالَهُمۡ وَعِصِيَّهُمۡ وَقَالُواْ بِعِزَّةِ فِرۡعَوۡنَ إِنَّا لَنَحۡنُ ٱلۡغَٰلِبُونَ

అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము(a)."

(a) చూడండి, 7:116 మరియు 20:66-67.
అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము(a)."

فَأَلۡقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ

ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది(a).

(a) చూడండి, 7:117.
ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది(a).

فَأُلۡقِيَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ

అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.

అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.

قَالُوٓاْ ءَامَنَّا بِرَبِّ ٱلۡعَٰلَمِينَ

వారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము,

رَبِّ مُوسَىٰ وَهَٰرُونَ

మూసా మరియు హారూన్ ల ప్రభువును."

మూసా మరియు హారూన్ ల ప్రభువును."

قَالَ ءَامَنتُمۡ لَهُۥ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِي عَلَّمَكُمُ ٱلسِّحۡرَ فَلَسَوۡفَ تَعۡلَمُونَۚ لَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ وَلَأُصَلِّبَنَّكُمۡ أَجۡمَعِينَ

(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా?(a) నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను(b)."

(a) చూడండి, 7:123. (b) చూడండి, 5:33 మరియు 7:124.
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా?(a) నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను(b)."

قَالُواْ لَا ضَيۡرَۖ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ

(మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది.

إِنَّا نَطۡمَعُ أَن يَغۡفِرَ لَنَا رَبُّنَا خَطَٰيَٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلۡمُؤۡمِنِينَ

నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే!"

۞ وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَسۡرِ بِعِبَادِيٓ إِنَّكُم مُّتَّبَعُونَ

మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు(a)."

(a) చూడండి, 7:130.
మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు(a)."

فَأَرۡسَلَ فِرۡعَوۡنُ فِي ٱلۡمَدَآئِنِ حَٰشِرِينَ

తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు.

إِنَّ هَٰٓؤُلَآءِ لَشِرۡذِمَةٞ قَلِيلُونَ

(ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే.

وَإِنَّهُمۡ لَنَا لَغَآئِظُونَ

మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు;

وَإِنَّا لَجَمِيعٌ حَٰذِرُونَ

మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము."

فَأَخۡرَجۡنَٰهُم مِّن جَنَّٰتٖ وَعُيُونٖ

కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము;

وَكُنُوزٖ وَمَقَامٖ كَرِيمٖ

మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా.

كَذَٰلِكَۖ وَأَوۡرَثۡنَٰهَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ

ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము(a).

(a) చూడండి, 7:137.
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము(a).

فَأَتۡبَعُوهُم مُّشۡرِقِينَ

అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు.

فَلَمَّا تَرَٰٓءَا ٱلۡجَمۡعَانِ قَالَ أَصۡحَٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدۡرَكُونَ

ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము!"

قَالَ كَلَّآۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهۡدِينِ

(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)(a)."

(a) అంటే అల్లాహ్ (సు.తా.) సహాయం నాతో ఉంది.
(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)(a)."

فَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضۡرِب بِّعَصَاكَ ٱلۡبَحۡرَۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرۡقٖ كَٱلطَّوۡدِ ٱلۡعَظِيمِ

అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది(a).

(a) చూడండి, 20:77.
అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది(a).

وَأَزۡلَفۡنَا ثَمَّ ٱلۡأٓخَرِينَ

మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము.

وَأَنجَيۡنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجۡمَعِينَ

మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము.

ثُمَّ أَغۡرَقۡنَا ٱلۡأٓخَرِينَ

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత.

وَٱتۡلُ عَلَيۡهِمۡ نَبَأَ إِبۡرَٰهِيمَ

ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు.

ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు.

إِذۡ قَالَ لِأَبِيهِ وَقَوۡمِهِۦ مَا تَعۡبُدُونَ

అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు;

قَالُواْ نَعۡبُدُ أَصۡنَامٗا فَنَظَلُّ لَهَا عَٰكِفِينَ

వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము."

قَالَ هَلۡ يَسۡمَعُونَكُمۡ إِذۡ تَدۡعُونَ

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా?

أَوۡ يَنفَعُونَكُمۡ أَوۡ يَضُرُّونَ

లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?"

قَالُواْ بَلۡ وَجَدۡنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفۡعَلُونَ

వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము."

قَالَ أَفَرَءَيۡتُم مَّا كُنتُمۡ تَعۡبُدُونَ

అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో?

أَنتُمۡ وَءَابَآؤُكُمُ ٱلۡأَقۡدَمُونَ

మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)?

فَإِنَّهُمۡ عَدُوّٞ لِّيٓ إِلَّا رَبَّ ٱلۡعَٰلَمِينَ

ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప!

ٱلَّذِي خَلَقَنِي فَهُوَ يَهۡدِينِ

ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.

وَٱلَّذِي هُوَ يُطۡعِمُنِي وَيَسۡقِينِ

ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు.

وَإِذَا مَرِضۡتُ فَهُوَ يَشۡفِينِ

మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు.

وَٱلَّذِي يُمِيتُنِي ثُمَّ يُحۡيِينِ

మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.

وَٱلَّذِيٓ أَطۡمَعُ أَن يَغۡفِرَ لِي خَطِيٓـَٔتِي يَوۡمَ ٱلدِّينِ

మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను.

رَبِّ هَبۡ لِي حُكۡمٗا وَأَلۡحِقۡنِي بِٱلصَّٰلِحِينَ

మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.

وَٱجۡعَل لِّي لِسَانَ صِدۡقٖ فِي ٱلۡأٓخِرِينَ

మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు(a).

(a) చూడండి, 19:50.
మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు(a).

وَٱجۡعَلۡنِي مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ

మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు.

وَٱغۡفِرۡ لِأَبِيٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ

మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే!(a)

(a) చూడండి, 19:47-48 మరియు 9:114.
మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే!(a)

وَلَا تُخۡزِنِي يَوۡمَ يُبۡعَثُونَ

మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు.

يَوۡمَ لَا يَنفَعُ مَالٞ وَلَا بَنُونَ

ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో!

إِلَّا مَنۡ أَتَى ٱللَّهَ بِقَلۡبٖ سَلِيمٖ

కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!"

وَأُزۡلِفَتِ ٱلۡجَنَّةُ لِلۡمُتَّقِينَ

మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది.

وَبُرِّزَتِ ٱلۡجَحِيمُ لِلۡغَاوِينَ

మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది.

وَقِيلَ لَهُمۡ أَيۡنَ مَا كُنتُمۡ تَعۡبُدُونَ

మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు?

مِن دُونِ ٱللَّهِ هَلۡ يَنصُرُونَكُمۡ أَوۡ يَنتَصِرُونَ

అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"(a)

(a) అంటే దేవతలుగా భావించబడిన పుణ్యపురుషులు మరియు విగ్రహాలు లేక మానవుడు ఆరాధించే సంపత్తులు, హోదాలు ఉన్నత స్థానాలు మొదలైనవి. చూడండి, 10:28-29.
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"(a)

فَكُبۡكِبُواْ فِيهَا هُمۡ وَٱلۡغَاوُۥنَ

అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.

وَجُنُودُ إِبۡلِيسَ أَجۡمَعُونَ

మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ(a).

(a) చూడండి, 2:24 19:68 మరియు 19:83.
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ(a).

قَالُواْ وَهُمۡ فِيهَا يَخۡتَصِمُونَ

వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:

వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:

تَٱللَّهِ إِن كُنَّا لَفِي ضَلَٰلٖ مُّبِينٍ

"అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.

إِذۡ نُسَوِّيكُم بِرَبِّ ٱلۡعَٰلَمِينَ

ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో!

وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلۡمُجۡرِمُونَ

మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే(a).

(a) చూడండి, 7:38 33:67-68 మరియు 38:60-61.
మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే(a).

فَمَا لَنَا مِن شَٰفِعِينَ

మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు.

وَلَا صَدِيقٍ حَمِيمٖ

మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.

మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.

فَلَوۡ أَنَّ لَنَا كَرَّةٗ فَنَكُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ

ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"(a)

(a) చూడండి, 6:27-28.
ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"(a)

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

كَذَّبَتۡ قَوۡمُ نُوحٍ ٱلۡمُرۡسَلِينَ

నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ نُوحٌ أَلَا تَتَّقُونَ

వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

۞ قَالُوٓاْ أَنُؤۡمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلۡأَرۡذَلُونَ

వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన(a) వారే కదా అనుసరిస్తున్నది?"

(a) అల్-అర్జ'లూన్: ధనసంపత్తులు లేనివారు. సమాజంలో తక్కువ శ్రేణికి చెందినవారిగా లెక్కించబడేవారు. లేక అధమమైనవిగా భావించే వృత్తులు చేసేవారు. చూడండి, 11:27.
వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన(a) వారే కదా అనుసరిస్తున్నది?"

قَالَ وَمَا عِلۡمِي بِمَا كَانُواْ يَعۡمَلُونَ

(నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు?

إِنۡ حِسَابُهُمۡ إِلَّا عَلَىٰ رَبِّيۖ لَوۡ تَشۡعُرُونَ

వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది(a).

(a) ఏ మానవుడు కూడా ఇతర మానవుడి హృదయంలో ఏముందో ఎరుగలేడు. కావున ఒకడు: 'నేను విశ్వాసుణ్ణి.' అని పలికి, తన ధర్మానికి విరుద్ధమైన చేష్టలు చేయడో, మాటలు పలుకడో, అట్టివాడు విశ్వాసుడిగానే పరిగణించబడాలి. మానవుని హృదయంలో ఉన్నది కేవలం అల్లాహ్ (సు.తా.) కే తెలుసు. కావున ఏ మానవునికి కూడా, ఇతర మానవుని విశ్వాసం గురించి అతని హృదయంలో ఉన్న ఆలోచనలను గురించి నిర్ణయం తీసుకునే హక్కు లేదు.
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది(a).

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلۡمُؤۡمِنِينَ

మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను.

إِنۡ أَنَا۠ إِلَّا نَذِيرٞ مُّبِينٞ

నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"

قَالُواْ لَئِن لَّمۡ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلۡمَرۡجُومِينَ

వారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు."

قَالَ رَبِّ إِنَّ قَوۡمِي كَذَّبُونِ

(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు.

فَٱفۡتَحۡ بَيۡنِي وَبَيۡنَهُمۡ فَتۡحٗا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ

కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు(a)."

(a) చూడండి, 7:89.
కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు(a)."

فَأَنجَيۡنَٰهُ وَمَن مَّعَهُۥ فِي ٱلۡفُلۡكِ ٱلۡمَشۡحُونِ

ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము.

ثُمَّ أَغۡرَقۡنَا بَعۡدُ ٱلۡبَاقِينَ

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము(a).

(a) నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48. ముంచి వేయబడిన వారిలో నూ'హ్ ('అ.స.) భార్య మరియు కుమారుడు కూడా ఉన్నారు. ఎందుకంటే వారు సత్యతిరస్కారులు.
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము(a).

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

كَذَّبَتۡ عَادٌ ٱلۡمُرۡسَلِينَ

ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ هُودٌ أَلَا تَتَّقُونَ

వారి సహోదరుడు(a) హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

(a) సహోదరుడు అంటే జాతి సోదరుడు. అదే జాతికి చెందినవాడు. ఇంకా చూడండి, 7:65.
వారి సహోదరుడు(a) హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

أَتَبۡنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةٗ تَعۡبَثُونَ

ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా?

وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمۡ تَخۡلُدُونَ

మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా?

وَإِذَا بَطَشۡتُم بَطَشۡتُمۡ جَبَّارِينَ

మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?

మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

وَٱتَّقُواْ ٱلَّذِيٓ أَمَدَّكُم بِمَا تَعۡلَمُونَ

మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి.

أَمَدَّكُم بِأَنۡعَٰمٖ وَبَنِينَ

ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు.

وَجَنَّٰتٖ وَعُيُونٍ

మరియు తోటలను మరియు చెలమలను.

మరియు తోటలను మరియు చెలమలను.

إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيمٖ

నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!"

قَالُواْ سَوَآءٌ عَلَيۡنَآ أَوَعَظۡتَ أَمۡ لَمۡ تَكُن مِّنَ ٱلۡوَٰعِظِينَ

వారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే!

إِنۡ هَٰذَآ إِلَّا خُلُقُ ٱلۡأَوَّلِينَ

ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే!(a)

(a) కాబట్టి మేము దానిని విడువలేము.
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే!(a)

وَمَا نَحۡنُ بِمُعَذَّبِينَ

మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు."

మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు."

فَكَذَّبُوهُ فَأَهۡلَكۡنَٰهُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము(a). నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

(a) 'ఆద్ జాతి ఒక బలవంతమైన సమాజముండేది. చూడండి, 89:8 చూడండి 41:15. అయినా వారు సత్యాన్ని తిరస్కరించి, దౌర్జన్యాలు చేసినందుకు నాశనం చేయబడ్డారు.
ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము(a). నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

كَذَّبَتۡ ثَمُودُ ٱلۡمُرۡسَلِينَ

సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది(a).

(a) స'మూద్ జాతి వారి నివాసం స'ఊది 'అరేబియాలో 'హిజ్ర్ అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రాంతం మదాయిన్ 'సాలిహ్' అని కూడా పిలవబడుతుంది. వారు అరబ్బులు. దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్రకు పోయేటప్పుడు, ఈ ప్రాంతం గుండా ప్రయాణం చేశారు. అక్కడి నుండి పోయేటప్పుడు తన ఒంటెను త్వరత్వరగా నడిపిస్తూ, తన అనుచరులతో అల్లాహ్ (సు.తా.) ను క్షమాపణ కోరుతూ త్వరత్వరగా ఈ ప్రాంతం నుండి సాగిపొండన్నారు.
సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది(a).

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ صَٰلِحٌ أَلَا تَتَّقُونَ

వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?(a)

(a) చూడండి, 7:73 మరియు 11:61-68.
వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?(a)

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

أَتُتۡرَكُونَ فِي مَا هَٰهُنَآ ءَامِنِينَ

ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా?

فِي جَنَّٰتٖ وَعُيُونٖ

తోటలలో మరియు చెలమలలో!

తోటలలో మరియు చెలమలలో!

وَزُرُوعٖ وَنَخۡلٖ طَلۡعُهَا هَضِيمٞ

మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;(a)

(a) 'తల్'ఉన్: అంటే క్రొత్తగా పుట్టే ఖర్జూర ఫలం, కొద్దిగా పెద్దదైన తరువాత దానిని బల్'హున్, ఆ తరువాత బస్ రున్, ఆ పిదప ర'త్ బున్, చివరకు తమ రున్. ఈ విధంగా వేర్వేరు స్థితులలో ఖర్జూర ఫలం పిలువబడుతోంది.
మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;(a)

وَتَنۡحِتُونَ مِنَ ٱلۡجِبَالِ بُيُوتٗا فَٰرِهِينَ

మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ!(a)

(a) చూడండి, 7:74.
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ!(a)

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

وَلَا تُطِيعُوٓاْ أَمۡرَ ٱلۡمُسۡرِفِينَ

మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి.

ٱلَّذِينَ يُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِ وَلَا يُصۡلِحُونَ

ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!"

قَالُوٓاْ إِنَّمَآ أَنتَ مِنَ ٱلۡمُسَحَّرِينَ

వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!

مَآ أَنتَ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا فَأۡتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!"

قَالَ هَٰذِهِۦ نَاقَةٞ لَّهَا شِرۡبٞ وَلَكُمۡ شِرۡبُ يَوۡمٖ مَّعۡلُومٖ

(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి(a).

(a) ఒంటె వృత్తాంతానికి చూడండి, 7:73-77.
(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి(a).

وَلَا تَمَسُّوهَا بِسُوٓءٖ فَيَأۡخُذَكُمۡ عَذَابُ يَوۡمٍ عَظِيمٖ

దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది."

فَعَقَرُوهَا فَأَصۡبَحُواْ نَٰدِمِينَ

కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు(a).

(a) వారు ఆ ఒంటెను చంపిన తరువాత 'సాలి'హ్ ('అ.స.) అన్నారు. మీకు మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నాలుగవ రోజు వారు అల్లాహ్ శిక్ష అవతరించడం చూసి పశ్చాత్తాప పడ్డారు. కాని శిక్ష వచ్చిన తరువాత పడే పశ్చాత్తాపం లాభదాయకం కాజాలదు.
కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు(a).

فَأَخَذَهُمُ ٱلۡعَذَابُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

كَذَّبَتۡ قَوۡمُ لُوطٍ ٱلۡمُرۡسَلِينَ

లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది(a).

(a) చూలూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:69-83 లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుడైన హారాన్ బిన్-ఆ'జర్ కుమారుడు. అతను కూడా ఇబ్రాహీమ ('అ.స.) జీవిత కాలంలోనే ప్రవక్తగా ఎన్నుకొనబడి, సోడోమ్ మరియు గొమొర్రెహ్ ప్రాంతాలకు పంపబడ్డారు. అవి జోర్డాన్ లో మృతసముద్రం (Dead Sea), ప్రాంతంలో ఉండేవి.
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది(a).

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ لُوطٌ أَلَا تَتَّقُونَ

వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

أَتَأۡتُونَ ٱلذُّكۡرَانَ مِنَ ٱلۡعَٰلَمِينَ

(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?

وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمۡ رَبُّكُم مِّنۡ أَزۡوَٰجِكُمۚ بَلۡ أَنتُمۡ قَوۡمٌ عَادُونَ

మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"(a)

(a) మొదటిసారిగా చరిత్రలో స్త్రీలను విడిచి, పురుషులు - పురుషులతో రతిక్రీడ (సంభోగం) వీరే ప్రారంభించారంటారు. ఆ నగరం పేరట, ఆ క్రియ ఈనాటికీ సొడోమి (Sodomy) అనబడుతోంది. ఈ కాలపు పశ్చిమ దేశాలలో పరస్పర అంగీకారంతో చేసే సొడోమి, లిస్బనిస్మ (Lesbianism) మరియు స్త్రీ పురుషుల వ్యభిచారాలు చట్టప్రకారం నేరంకావు. ఈ సమాజం ఎటుపోతోంది?
మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"(a)

قَالُواْ لَئِن لَّمۡ تَنتَهِ يَٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلۡمُخۡرَجِينَ

(దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు!"

قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ ٱلۡقَالِينَ

(లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను."

رَبِّ نَجِّنِي وَأَهۡلِي مِمَّا يَعۡمَلُونَ

(ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు."

فَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥٓ أَجۡمَعِينَ

కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము -

إِلَّا عَجُوزٗا فِي ٱلۡغَٰبِرِينَ

వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప!(a)

(a) చూముసలామె అంటే లూ'త్ ('అ.స.) భార్య. ఆమె సత్యతిరస్కారి. ఆమె అదే ప్రాంతవాసి. చూడండి, 7:83, 11:81, 27:57, 29:32-33 మరియు 66:10.
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప!(a)

ثُمَّ دَمَّرۡنَا ٱلۡأٓخَرِينَ

ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.

ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.

وَأَمۡطَرۡنَا عَلَيۡهِم مَّطَرٗاۖ فَسَآءَ مَطَرُ ٱلۡمُنذَرِينَ

వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం(a).

(a) చూడండి, 11:82-83.
వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం(a).

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

كَذَّبَ أَصۡحَٰبُ لۡـَٔيۡكَةِ ٱلۡمُرۡسَلِينَ

వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు(a).

(a) చూఅ'య్ కహ్ వాసులు అంటే, అడవివాసులు. మద్ యన్ కు కొంత దూరంలో ఉన్న అడవి ప్రాంతం అ'య్ కహ్ అనబడుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఇలా ఉంది: అ'య్ కహ్ అంటే ఒక పెద్ద చెట్టు అది మద్ యన్ కు కొంత దూరంలో ఉండింది. దాని వాసులు ఆ చెట్టును ఆరాధించే వారు. షు'ఐబ్ ('అ.స.) మద్ యన్ వాసులు. కావున అతను మద్ యన్ వాసుల సోదరుడు అని పేర్కొనబడ్డారు. చూడండి, 7:85. వారు ఈ రెండు ప్రాంతాలలో ధర్మప్రచారం చేశారు. (ఇబ్నె-కసీ'ర్).
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు(a).

إِذۡ قَالَ لَهُمۡ شُعَيۡبٌ أَلَا تَتَّقُونَ

షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?(a)

(a) చూడండి 7:85 మరియు షు'ఐబ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:84-95.
షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?(a)

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

۞ أَوۡفُواْ ٱلۡكَيۡلَ وَلَا تَكُونُواْ مِنَ ٱلۡمُخۡسِرِينَ

మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి!

وَزِنُواْ بِٱلۡقِسۡطَاسِ ٱلۡمُسۡتَقِيمِ

త్రాసుతో సరిసమానంగా తూచండి.

త్రాసుతో సరిసమానంగా తూచండి.

وَلَا تَبۡخَسُواْ ٱلنَّاسَ أَشۡيَآءَهُمۡ وَلَا تَعۡثَوۡاْ فِي ٱلۡأَرۡضِ مُفۡسِدِينَ

ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి(a).

(a) చూడండి, 7:86.
ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి(a).

وَٱتَّقُواْ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلۡجِبِلَّةَ ٱلۡأَوَّلِينَ

మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి(a)."

(a) జిబలతున్: అంటే చాలా మంది లేక పెద్ద వర్గం అని అర్థం.
మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి(a)."

قَالُوٓاْ إِنَّمَآ أَنتَ مِنَ ٱلۡمُسَحَّرِينَ

వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!

వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!

وَمَآ أَنتَ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلۡكَٰذِبِينَ

నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము!

فَأَسۡقِطۡ عَلَيۡنَا كِسَفٗا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి."

قَالَ رَبِّيٓ أَعۡلَمُ بِمَا تَعۡمَلُونَ

(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!"

فَكَذَّبُوهُ فَأَخَذَهُمۡ عَذَابُ يَوۡمِ ٱلظُّلَّةِۚ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوۡمٍ عَظِيمٍ

కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష!(a)

(a) చూషు'ఐబ్ ('అ.స) తెగవారి మీద మూడు రకాల శిక్షలు వచ్చాయి. 7:91 లో భూకంపం, 11:94 లో భయంకర ధ్వని, మరియు ఇక్కడ మేఘాల, రాళ్ళ వర్షపు శిక్ష అని పేర్కొనబడ్డాయి. అంటే మూడు రకాల శిక్షలు ఒకేసారి వచ్చాయన్నమాట. (ఇబ్నె-కసీ'ర్).
కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష!(a)

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత(a).

(a) చూదీనితో ఏడు గాథలు ముగుస్తున్నాయి. అన్నితరాల ప్రజలలో ఒకే విధమైన లక్షణాలు, స్వభావాలు ఉన్నాయి. వారంతా తమ సందేశహరుల సత్యసందేశాన్ని తిరస్కరించి వారిపై దౌర్జన్యాలు చేశారు. తమ తండ్రితాతల ధర్మాలను అవలంబించారు. 'నీ ప్రభువు శిక్షను తీసుకురా,' అని అన్నారు. చివరకు వారిపై శిక్ష అవతరింపజేయబడి నాశనం చేయబడ్డారు. వారి పరలోక శిక్ష నరకమే. ప్రతికాలంలో కూడా చాలా మట్టుకు పేదవారూ, తక్కువ ఆర్థిక, సామాజిక స్థానాలకు చెందిన వారే ప్రవక్తలను మొట్టమొదట అనుసరించారు. అందుకే స్వర్గంలో ఎక్కువగా ఇలాంటి వారే ఉంటారు.
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత(a).

وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلۡعَٰلَمِينَ

మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).

نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلۡأَمِينُ

దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు(a);

(a) చూఏ విధంగానైతే పూర్వపు దైవప్రవక్తల మీద జిబ్రీల్ ('అ.స.) ద్వారా దివ్యజ్ఞానం అవతరింపజేయ బడిందో, అదే విధంగా ము'హమ్మద్ ('స'అస) పైన కూడా ఈ ఖుర్ఆన్ అవతరింప జేయబడింది. అతను నిరక్షరాస్యుడయినా, పూర్వ ప్రవక్తల గాథలు వినిపించటమే ఖుర్ఆన్ దివ్యావతరణకు నిదర్శనం. అర్ రూ'హుల్ అమీన్: నమ్మదగిన ఆత్మ, అంటే జిబ్రీల్ ('అ.స.)'
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు(a);

عَلَىٰ قَلۡبِكَ لِتَكُونَ مِنَ ٱلۡمُنذِرِينَ

నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;

بِلِسَانٍ عَرَبِيّٖ مُّبِينٖ

స్పష్టమైన అరబ్బీ భాషలో(a)!

(a) చూడండి, 14:4 ఇతర 'అరబ్ ప్రవక్తలు ఇస్మా'యీల్, హూద్, 'సాలి'హ్ మరియు షు'ఐబ్ 'అలైహిస్సలామ్ లు. హీబ్రూ మరియు అరమాయిక్ ప్రాచీన 'అరబ్బీ భాషలే! ఇతర దివ్యగ్రంథాలు ఆయా సంఘాల వారి కొరకు అవతరింప జేయబడి ఉండెను. 'అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ చివరి దివ్యగ్రంథం మరియు ఆధునిక కాలంలో వచ్చింది. ఇప్పుడు భూగోళమంతా ఒక గ్లోబల్ విల్లేజ్ గా మారిపోయింది, కాబట్టి ఈ ఖుర్ఆన్ సర్వలోకాల వారికి మార్గదర్శనిగా చివరి దివ్యగ్రంథంగా పంపబడింది. చూడండి, 7:158 మరియు 25:1. ఈ ఖుర్ఆన్ 14 వందల సంవత్సరాలు గడిచినా దాని అసలు రూపంలో ఉండి, అందులో ఏ ఒక్క అక్షరపు మార్పు కూడా లేకుండా భద్రపరచబడింది. ఇది అల్లాహ్ (సు.తా.) వాగ్దానం. అల్లాహ్ (సు.తా.) ఇష్టంతో ఇది ఇప్పుడు ప్రపంచంలోని వివిధ భాషలలో అనువాదం చేయబడుతోంది. అల్లాహ్ (సు.తా.) అనుగ్రహంతో సత్యాన్ని అర్థం చేసుకోగలవారు, దీనిని అర్తం చేసుకొని, సత్యధర్మాన్ని (ఇస్లాంను) స్వీకరించి శాశ్వతంగా స్వర్గవాసానికి అర్హులయ్యే మార్గాన్ని అవలంబిస్తున్నారు.
స్పష్టమైన అరబ్బీ భాషలో(a)!

وَإِنَّهُۥ لَفِي زُبُرِ ٱلۡأَوَّلِينَ

నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది(a).

(a) ఈ ప్రస్తావన కొరకు చూడండి, 2:42 మరియు ద్వితీయోపదేశ కాండము - (Deuteronomy), 18:15,18 మరియు యోహాను - (John), 14:16.
నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది(a).

أَوَلَمۡ يَكُن لَّهُمۡ ءَايَةً أَن يَعۡلَمَهُۥ عُلَمَٰٓؤُاْ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ

ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు(a) ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?

(a) ఉదాహరణకు: 'అబ్దుల్లాహ్ ఇబ్నె-సల్లాం, కా'బ్ ఇబ్నె మాలిక్ మరియు ఇతర మదీనా యూద విద్వాంసులు ఈ విషయం తెలుసుకొని ఇస్లాం స్వీకరించారు. ఈ రోజు వరకు కూడా ఎంతో మంది యూద మరియు క్రైస్తవ విద్వాంసులు ఈ విషయం తెలుసుకొని ఇస్లాం స్వీకరిస్తున్నారు.
ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు(a) ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?

وَلَوۡ نَزَّلۡنَٰهُ عَلَىٰ بَعۡضِ ٱلۡأَعۡجَمِينَ

ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే!

فَقَرَأَهُۥ عَلَيۡهِم مَّا كَانُواْ بِهِۦ مُؤۡمِنِينَ

అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు(a).

(a) చూడండి, 41:44.
అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు(a).

كَذَٰلِكَ سَلَكۡنَٰهُ فِي قُلُوبِ ٱلۡمُجۡرِمِينَ

ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము.

لَا يُؤۡمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُاْ ٱلۡعَذَابَ ٱلۡأَلِيمَ

కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు.

فَيَأۡتِيَهُم بَغۡتَةٗ وَهُمۡ لَا يَشۡعُرُونَ

అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది.

فَيَقُولُواْ هَلۡ نَحۡنُ مُنظَرُونَ

అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?(a)

(a) శిక్ష వచ్చిన తరువాత వ్యవధి ఇవ్వబడదు మరియు అప్పుడు చేసే పశ్చాత్తాపం కూడా అంగీకరించబడదు. చూడండి, 23:85.
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?(a)

أَفَبِعَذَابِنَا يَسۡتَعۡجِلُونَ

ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?(a)

(a) ఈ శిక్ష కోరిన దానికి చూడండి, 6:57 మరియు 8:32.
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?(a)

أَفَرَءَيۡتَ إِن مَّتَّعۡنَٰهُمۡ سِنِينَ

చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా!

ثُمَّ جَآءَهُم مَّا كَانُواْ يُوعَدُونَ

తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు;

مَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يُمَتَّعُونَ

వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు(a).

(a) చూడండి, 2:96.
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు(a).

وَمَآ أَهۡلَكۡنَا مِن قَرۡيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ

మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు!

ذِكۡرَىٰ وَمَا كُنَّا ظَٰلِمِينَ

హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు(a).

(a) చూడండి, 6:131, 15:4, 20:134, 17:15, 28:59 అల్లాహ్ (సు.తా.), హెచ్చరిక చేయటానికి ప్రవక్తలను పంపనిదే ఏ సమాజాన్ని కూడా నాశనం చేయలేదు.
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు(a).

وَمَا تَنَزَّلَتۡ بِهِ ٱلشَّيَٰطِينُ

మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు.

وَمَا يَنۢبَغِي لَهُمۡ وَمَا يَسۡتَطِيعُونَ

మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు.

إِنَّهُمۡ عَنِ ٱلسَّمۡعِ لَمَعۡزُولُونَ

వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు.

فَلَا تَدۡعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلۡمُعَذَّبِينَ

కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు.

وَأَنذِرۡ عَشِيرَتَكَ ٱلۡأَقۡرَبِينَ

మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;

మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;

وَٱخۡفِضۡ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ

విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు(a).

(a) చూడండి, 17:24.
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు(a).

فَإِنۡ عَصَوۡكَ فَقُلۡ إِنِّي بَرِيٓءٞ مِّمَّا تَعۡمَلُونَ

ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను."

وَتَوَكَّلۡ عَلَى ٱلۡعَزِيزِ ٱلرَّحِيمِ

మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో!

ٱلَّذِي يَرَىٰكَ حِينَ تَقُومُ

ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు(a).

(a) కొందరు వ్యాఖ్యాతలు: "నీవు నమా'జ్ లో నిలిచినప్పుడు." అని అంటారు.
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు(a).

وَتَقَلُّبَكَ فِي ٱلسَّٰجِدِينَ

మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా!

إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ

నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

هَلۡ أُنَبِّئُكُمۡ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَٰطِينُ

షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా?

تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٖ

వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;

వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;

يُلۡقُونَ ٱلسَّمۡعَ وَأَكۡثَرُهُمۡ كَٰذِبُونَ

గాలి వార్తలను చెవులలో ఊదుతారు(a); మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!

(a) అంటే ఆ సైతానులు తమను వినేవారి చెవులలో వినీవినని బూటకపు మాటలను ఊదుతారు.
గాలి వార్తలను చెవులలో ఊదుతారు(a); మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!

وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلۡغَاوُۥنَ

మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు(a).

(a) చూడండి, 36:69. ఆ కాలపు కొందరు 'అరబ్బులు ఈ ఖుర్ఆన్ ను ము'హమ్మద్ ('స.'అస) రచించిన కవితగా అపోహపడ్డారు. అందుకే ఈ ఆయత్ లో కవులను అనుసరించే వారు మార్గభ్రష్టులని అల్లాహ్ (సు.తా.) విశదీకరించాడు. ఈ ఖుర్ఆన్ దివ్యజ్ఞానం (వ'హీ) కాబట్టి ఖుర్ఆన్ లో : "దీని వంటి ఒక్క సూరహ్ నయినా మీరంతా కలసి రచించి తీసుకురండి." అని సవాలు (Challenge) చేయబడింది. కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా దానిని పూర్తి చేయలేక పోయారు.
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు(a).

أَلَمۡ تَرَ أَنَّهُمۡ فِي كُلِّ وَادٖ يَهِيمُونَ

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని(a);

(a) చూ కవులు చాలా మట్టుకు ఊహాగానాలే చేస్తుంటారు. కాబట్టి కవిత్వంలో స్వవిరుద్ధమైన వ్యాఖ్యానాలు ఉంటాయి. వారి వివరణ లక్ష్యం లేనిది, భ్రమింపజేసేది. కాని ఖుర్ఆన్ మానవులను సత్యమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి అవతరింప జేయబడింది. అల్లాహ్ (సు.తా.), మానవుని సృష్టికర్త అవతరింపజేసిన మానవుని యొక్క నిర్దేశక గ్రంథమే (Operation Manual) ఈ ఖుర్ఆన్. ఇది మానవునికి మార్గదర్శిని.
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని(a);

وَأَنَّهُمۡ يَقُولُونَ مَا لَا يَفۡعَلُونَ

మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని;

إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَذَكَرُواْ ٱللَّهَ كَثِيرٗا وَٱنتَصَرُواْ مِنۢ بَعۡدِ مَا ظُلِمُواْۗ وَسَيَعۡلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓاْ أَيَّ مُنقَلَبٖ يَنقَلِبُونَ

కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప!(a) అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు.

(a) ఇక్కడ ఆ కవులకే, కవిత్వం చేసే అనుమతి ఇవ్వబడింది, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో మరియు అల్లాహ్ (సు.తా.) ను అమితంగా ప్రార్థిస్తారో మరియు ఊహాగానాలు చేయక సత్యాధారంపై కవిత్వం చేస్తారో! ఉదారహరణకు: 'హస్సాన్ బిన్ సా'బిత్ (ర'ది. 'అ.), తన కవిత్వంతో సత్యతిరస్కారుల కవిత్వానికి తగిన జవాబు ఇచ్చేవారు. దైవప్రవక్త ('స'అస) అతనితో ఇలా అనేవారు: 'ఈ సత్యతిరస్కారులకు జవాబివ్వు, జిబ్రీల్ (అ.స.) నీకు తోడ్పడు గాక!' ('స'హీ'హ్ బుఖా'రీ). దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే సత్యతిరస్కారులకు జవాబివ్వటానికి, సత్యాధారంగా చేసే కవిత్వం మరియు సత్యాన్ని, తౌహీద్ ను మరియు సున్నతును స్థాపించటానికి చేసే కవిత్వం ధర్మసమ్మతమైనదే!

Footer Include