テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad
クルアーン・テルグ語対訳 - Maulana Abder-Rahim ibn Muhammad
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا
భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు!(a)
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు!(a)
وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا
మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.
يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا
ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.(a)
بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا
ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.
يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ
ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.
فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.(a)
وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ
మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.
مشاركة عبر