Header Include

テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

クルアーン・テルグ語対訳 - Maulana Abder-Rahim ibn Muhammad

QR Code https://quran.islamcontent.com/ja/telugu_muhammad

وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ

అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా!

అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా!

وَطُورِ سِينِينَ

సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా!(a)

(a) చూ'చూడండి, 15:23.
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా!(a)

وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ

ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా!(a)

(a) చూఈ శాంతి నగరం అంటే మక్కా ముకర్రమా చూడండి, 2:126 ఇందులో యుద్ధం చేయటం నిషేధించబడింది. ఇందులో ప్రవేశించిన వానికి శాంతి, భద్రతలు లభిస్తాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది మూడు చోట్లను సూచిస్తుంది. (1) 'తూర్ పర్వతం - మూసా ('అ.స.) ను ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం, (2) బైతుల్ ముఖద్దస్-'ఈసా ('అ.స.) పుట్టి ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం, (3) మక్కా ముకర్రమా - ము'హమ్మద్ ('స'అస) పుట్టి ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం. (ఇబ్నె-కసీ'ర్) . మక్కా ప్రస్తావనకు ఇంకా చూడండి 48:24.
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా!(a)

لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٖ

వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.(a)

(a) చూడండి, 91:7, 97:2 మరియు 75:38
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.(a)

ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ

తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము.

తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము.

إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٖ

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.

فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ

అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?

అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?

أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ

ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?

ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?
Footer Include