Ibisobanuro bya Qur'an mu rurimi rw'igitelugu-Maulana Abder-Rahim Ibun Muhammad.
Yasobanuwe na Abdu Rahim Ibun Muhamad.
ٱلۡقَارِعَةُ
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!(a)
مَا ٱلۡقَارِعَةُ
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?
يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.(a)
وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.(a)
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!(a)
فَهُوَ فِي عِيشَةٖ رَّاضِيَةٖ
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.
وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!(a)
فَأُمُّهُۥ هَاوِيَةٞ
అతని నివాసం అధః పాతాళమే.(a)
وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ
మరియు అది ఏమిటో నీకేం తెలుసు?
نَارٌ حَامِيَةُۢ
అదొక భగభగమండే అగ్ని (గుండం).(a)
مشاركة عبر