Header Include

Telugu translation - Abder-Rahim ibn Muhammad

Translation of the Quran meanings into Telugu by Maulana Abder-Rahim ibn Muhammad.

QR Code https://quran.islamcontent.com/te/telugu_muhammad

وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا

వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!(a)

(a) 'దబ్'హన్: వగర్చుతూ.
వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!(a)

فَٱلۡمُورِيَٰتِ قَدۡحٗا

తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;(a)

(a) అల్-మారియాతు: అగ్నికణాలు లేపే! ఖద్'హున్: ఖరాల తట్టులు.
తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;(a)

فَٱلۡمُغِيرَٰتِ صُبۡحٗا

తెల్లవారుఝామున దాడి చేసేవాటి;(a)

(a) అల్-ము'గీరాతు: దాడి చేసేవాటి.
తెల్లవారుఝామున దాడి చేసేవాటి;(a)

فَأَثَرۡنَ بِهِۦ نَقۡعٗا

(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;(a)

(a) అసా'ర: లేపుట, నఖ్'వున్: దుమ్ము.
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;(a)

فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا

(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.

(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.

إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٞ

నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.(a)

(a) కనూదున్: అంటే కఫూరున్, కృతఘ్నుడు.
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.(a)

وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٞ

మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.

మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.

وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ

మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.

మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.

۞ أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ

ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;(a)

(a) అంటే గోరీలలో ఉన్న శవాలను సజీవులుగా చేసి లేపి సమావేశపరచబడినప్పుడు.
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;(a)

وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ

మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;

మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;

إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٖ لَّخَبِيرُۢ

నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!

నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!
Footer Include