Telugu translation - Abder-Rahim ibn Muhammad
Translation of the Quran meanings into Telugu by Maulana Abder-Rahim ibn Muhammad.
وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా!
وَطُورِ سِينِينَ
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా!(a)
وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా!(a)
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٖ
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.(a)
ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము.
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٖ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.
فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?
أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?
مشاركة عبر