Header Include

Telugu translation - Abder-Rahim ibn Muhammad

Translation of the Quran meanings into Telugu by Maulana Abder-Rahim ibn Muhammad.

QR Code https://quran.islamcontent.com/te/telugu_muhammad

يسٓ

యా సీన్!(a)

(a) యా-సీన్, ఈ రెండు అక్షరాలు కూడా, ఇతర అక్షరాల వలె ముఖత్తఆత్ లలోనివే! కావున వీటి నిజ అర్థం ఎవరికీ తెలియదు. కొందరు దీని అర్థం: 'ఓ మానవుడా!' అని అంటారు. మరికొందరు: 'ఇది దైవప్రవక్తను సంబోధిస్తుంది' అని అంటారు.
యా సీన్!(a)

وَٱلۡقُرۡءَانِ ٱلۡحَكِيمِ

వివేకంతో నిండి ఉన్న ఖుర్ఆన్ సాక్షిగా!

వివేకంతో నిండి ఉన్న ఖుర్ఆన్ సాక్షిగా!

إِنَّكَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు.(a)

(a) మక్కా ముష్రికులు: 'నీవు దైవప్రవక్తవు కావు!' అని ము'హమ్మద్ ('స'అస) తో అనేవారు. చూడండి, 13:43. దానికి జవాబుగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది.
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు.(a)

عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు.

(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు.

تَنزِيلَ ٱلۡعَزِيزِ ٱلرَّحِيمِ

ఇది (ఈ ఖుర్ఆన్) సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది.(a)

(a) చూడండి, 34:50.
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది.(a)

لِتُنذِرَ قَوۡمٗا مَّآ أُنذِرَ ءَابَآؤُهُمۡ فَهُمۡ غَٰفِلُونَ

ఏ జాతి వారి తండ్రి తాతలైతే హెచ్చరిక చేయబడక, నిర్లక్ష్యులై ఉన్నారో, వారిని హెచ్చరించటానికి.(a)

(a) చూడండి, 6:131-132.
ఏ జాతి వారి తండ్రి తాతలైతే హెచ్చరిక చేయబడక, నిర్లక్ష్యులై ఉన్నారో, వారిని హెచ్చరించటానికి.(a)

لَقَدۡ حَقَّ ٱلۡقَوۡلُ عَلَىٰٓ أَكۡثَرِهِمۡ فَهُمۡ لَا يُؤۡمِنُونَ

వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు.(a)

(a) 'నేను జిన్నాతులు మరియు మానవులతో నరకాన్ని నింపుతాను!' (32:13, 38:85).
వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు.(a)

إِنَّا جَعَلۡنَا فِيٓ أَعۡنَٰقِهِمۡ أَغۡلَٰلٗا فَهِيَ إِلَى ٱلۡأَذۡقَانِ فَهُم مُّقۡمَحُونَ

నిశ్చయంగా, మేము వారి మెడలలో పట్టాలు వేశాము.(a) అవి వారి గడ్డాల వరకు వున్నాయి. కావున వారి తలలు నిక్కి వున్నాయి.

(a) చూడండి, 13:5 మరియు 34:33.
నిశ్చయంగా, మేము వారి మెడలలో పట్టాలు వేశాము.(a) అవి వారి గడ్డాల వరకు వున్నాయి. కావున వారి తలలు నిక్కి వున్నాయి.

وَجَعَلۡنَا مِنۢ بَيۡنِ أَيۡدِيهِمۡ سَدّٗا وَمِنۡ خَلۡفِهِمۡ سَدّٗا فَأَغۡشَيۡنَٰهُمۡ فَهُمۡ لَا يُبۡصِرُونَ

మరియు మేము వారి ముందు ఒక అడ్డు (తెరను) మరియు వారి వెనుక ఒక అడ్డు (తెర)ను నిలబెట్టాము. మరియు మేము వారిని కప్పి వేశాము అందువల్ల వారు ఏమీ చూడలేరు.

وَسَوَآءٌ عَلَيۡهِمۡ ءَأَنذَرۡتَهُمۡ أَمۡ لَمۡ تُنذِرۡهُمۡ لَا يُؤۡمِنُونَ

మరియు నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించక పోయినా, వారికి సమానమే, వారు విశ్వసించరు!

إِنَّمَا تُنذِرُ مَنِ ٱتَّبَعَ ٱلذِّكۡرَ وَخَشِيَ ٱلرَّحۡمَٰنَ بِٱلۡغَيۡبِۖ فَبَشِّرۡهُ بِمَغۡفِرَةٖ وَأَجۡرٖ كَرِيمٍ

నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుసరిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం (స్వర్గం) లభిస్తుందనే శుభవార్తను అందజేయి.

إِنَّا نَحۡنُ نُحۡيِ ٱلۡمَوۡتَىٰ وَنَكۡتُبُ مَا قَدَّمُواْ وَءَاثَٰرَهُمۡۚ وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ فِيٓ إِمَامٖ مُّبِينٖ

నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము.(a) మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడుతున్నాము.

(a) చూఎవడైతే ఇస్లాంలో ఒక మంచి పనిని ప్రారంభిస్తాడో అతనికి అతనికి దాని పుణ్యఫలితం లభిస్తుంది. అంతేగాక, అతని తరువాత ఇతరులు దానిపై నడిస్తే - ఆ అనుసరించే, వారి పుణ్యంలో ఎట్టి తగ్గింపు లేకుండా - ఆ పుణ్యం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది. ఇక ఒకడు చెడ్డపని ప్రారంభిస్తే అతనికి దాని శిక్ష కాక, దానిపై నడిచే వారందరి పాపాల శిక్ష కూడా విధించబడుతుంది. (స'హీ'హ్ ముస్లిం). ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని కర్మలు ఆగిపోతాయి. మూడు విషయాలు తప్ప. 1) జ్ఞానం - దేనినైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారో! 2) పుణ్యాత్ములైన సంతానం - ఎవరైతే చనిపోయిన తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారో! 3) 'సదఖహ్ జారియహ్ - దేనితోనైతే అతడు మరణించిన తరువాత కూడా, ప్రజలు లాభం పొందుతూ ఉంటారో! ('స'హీ'హ్ ముస్లిం).
నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము.(a) మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడుతున్నాము.

وَٱضۡرِبۡ لَهُم مَّثَلًا أَصۡحَٰبَ ٱلۡقَرۡيَةِ إِذۡ جَآءَهَا ٱلۡمُرۡسَلُونَ

వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల(a) గాథను వినిపించు;

(a) ఈ నగరం అంటాకియా (Antakiya) కావచ్చని కొందరు వ్యాఖ్యాతలన్నారు.
వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల(a) గాథను వినిపించు;

إِذۡ أَرۡسَلۡنَآ إِلَيۡهِمُ ٱثۡنَيۡنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزۡنَا بِثَالِثٖ فَقَالُوٓاْ إِنَّآ إِلَيۡكُم مُّرۡسَلُونَ

మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరినీ అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరిచాము. అప్పుడు వారు, వారితో: "నిశ్చయంగా, మేము (మీ వద్దకు పంపబడిన) సందేశహరులం" అని అన్నారు.

قَالُواْ مَآ أَنتُمۡ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا وَمَآ أَنزَلَ ٱلرَّحۡمَٰنُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا تَكۡذِبُونَ

(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: "మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు?"(a)

(a) చూడండి, 6:91 మరియు 34:31.
(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: "మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు?"(a)

قَالُواْ رَبُّنَا يَعۡلَمُ إِنَّآ إِلَيۡكُمۡ لَمُرۡسَلُونَ

(ఆ ప్రవక్తలు) అన్నారు: "మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము!

وَمَا عَلَيۡنَآ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ

మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే!"

قَالُوٓاْ إِنَّا تَطَيَّرۡنَا بِكُمۡۖ لَئِن لَّمۡ تَنتَهُواْ لَنَرۡجُمَنَّكُمۡ وَلَيَمَسَّنَّكُم مِّنَّا عَذَابٌ أَلِيمٞ

(ఆ నగరవాసులు) అన్నారు; "నిశ్చయంగా, మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది."

قَالُواْ طَٰٓئِرُكُم مَّعَكُمۡ أَئِن ذُكِّرۡتُمۚ بَلۡ أَنتُمۡ قَوۡمٞ مُّسۡرِفُونَ

(ఆ ప్రవక్తలు) అన్నారు: "మీ అపశకునం మీ వెంటనే ఉంది.(a) మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరి పోయిన ప్రజలు." (b)

(a) చూడండి, 17:13. (a) చూడండి, 10:12.
(ఆ ప్రవక్తలు) అన్నారు: "మీ అపశకునం మీ వెంటనే ఉంది.(a) మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరి పోయిన ప్రజలు." (b)

وَجَآءَ مِنۡ أَقۡصَا ٱلۡمَدِينَةِ رَجُلٞ يَسۡعَىٰ قَالَ يَٰقَوۡمِ ٱتَّبِعُواْ ٱلۡمُرۡسَلِينَ

ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈ సందశహరులను అనుసరించండి!

ٱتَّبِعُواْ مَن لَّا يَسۡـَٔلُكُمۡ أَجۡرٗا وَهُم مُّهۡتَدُونَ

మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరని వారిని (ఈ సందేశహరులను) అనుసరించండి! వారు సన్మార్గంలో ఉన్నారు.

وَمَالِيَ لَآ أَعۡبُدُ ٱلَّذِي فَطَرَنِي وَإِلَيۡهِ تُرۡجَعُونَ

"మరియు నన్ను సృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు."

ءَأَتَّخِذُ مِن دُونِهِۦٓ ءَالِهَةً إِن يُرِدۡنِ ٱلرَّحۡمَٰنُ بِضُرّٖ لَّا تُغۡنِ عَنِّي شَفَٰعَتُهُمۡ شَيۡـٔٗا وَلَا يُنقِذُونِ

ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలచుకుంటే, వారి సిఫారసు నాకు ఏ మాత్రం ఉపయోగ పడదు మరియు వారు నన్ను కాపాడనూలేరు.

إِنِّيٓ إِذٗا لَّفِي ضَلَٰلٖ مُّبِينٍ

అలా చేస్తే నిశ్చయంగా, నేను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి పోయిన వాడిని అవుతాను.

إِنِّيٓ ءَامَنتُ بِرَبِّكُمۡ فَٱسۡمَعُونِ

నిశ్చయంగా, నేను మీ ప్రభువును విశ్వసిస్తున్నాను, కావున మీరు నా మాట వినండి!"

قِيلَ ٱدۡخُلِ ٱلۡجَنَّةَۖ قَالَ يَٰلَيۡتَ قَوۡمِي يَعۡلَمُونَ

(అతనిని వారు చంపిన తరువాత అతనితో) ఇలా అనబడింది: "నీవు స్వర్గంలో ప్రవేశించు." అతడు ఇలా అన్నాడు: "అయ్యో! నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది!

بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ ٱلۡمُكۡرَمِينَ

నా ప్రభువు నన్ను క్షమించాడు మరియు నన్ను గౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడు!" అనేది.

۞ وَمَآ أَنزَلۡنَا عَلَىٰ قَوۡمِهِۦ مِنۢ بَعۡدِهِۦ مِن جُندٖ مِّنَ ٱلسَّمَآءِ وَمَا كُنَّا مُنزِلِينَ

మరియు ఆ తరువాత అతని జాతి వారి మీదకు, మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్నీ పంపలేదు. అసలు మాకు సైన్యాన్ని పంపే అవసరమే ఉండదు!

إِن كَانَتۡ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ فَإِذَا هُمۡ خَٰمِدُونَ

అది కేవలం ఒక పెద్ద ధ్వని(a) మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతం చేయబడ్డారు.

(a) 'సయ్'హతున్: ధ్వని, అరుపు, గర్జన లేక శబ్దం. ఇంకా చూడండి, 36:49, 53, 38:15.
అది కేవలం ఒక పెద్ద ధ్వని(a) మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతం చేయబడ్డారు.

يَٰحَسۡرَةً عَلَى ٱلۡعِبَادِۚ مَا يَأۡتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ

ఆ దాసుల గతి ఎంత శోచనీయమయినది! వారి వద్దకు ఏ సందేశహరుడు వచ్చినా, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండలేదు.

أَلَمۡ يَرَوۡاْ كَمۡ أَهۡلَكۡنَا قَبۡلَهُم مِّنَ ٱلۡقُرُونِ أَنَّهُمۡ إِلَيۡهِمۡ لَا يَرۡجِعُونَ

ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా)? వారికి ముందు మేము ఎన్నో తరాలను నాశనం చేశామని? నిశ్చయంగా, వారు (వారి పూర్వీకులు) ఎన్నటికీ వారి వద్దకు తిరిగి రాలేదు.

وَإِن كُلّٞ لَّمَّا جَمِيعٞ لَّدَيۡنَا مُحۡضَرُونَ

కాని వారందరినీ కలిపి ఒకేసారి, మా ముందు హాజరు పరచడం జరుగుతుంది.

وَءَايَةٞ لَّهُمُ ٱلۡأَرۡضُ ٱلۡمَيۡتَةُ أَحۡيَيۡنَٰهَا وَأَخۡرَجۡنَا مِنۡهَا حَبّٗا فَمِنۡهُ يَأۡكُلُونَ

మరియు వారి కొరకు సూచనగా జీవం లేని ఈ భూమియే ఉంది. మేము దీనికి ప్రాణం పోసి, దీని నుండి ధాన్యం తీస్తాము, దాన్ని వారు తింటారు.

وَجَعَلۡنَا فِيهَا جَنَّٰتٖ مِّن نَّخِيلٖ وَأَعۡنَٰبٖ وَفَجَّرۡنَا فِيهَا مِنَ ٱلۡعُيُونِ

మేము దీనిలో ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలను పెంచాము మరియు వాటిలో ఊటలను ప్రవహింపజేశాము.

لِيَأۡكُلُواْ مِن ثَمَرِهِۦ وَمَا عَمِلَتۡهُ أَيۡدِيهِمۡۚ أَفَلَا يَشۡكُرُونَ

వారు దీని ఫలాలను తినటానికి; మరియు ఇదంతా వారి చేతులు చేసింది కాదు. అయినా వారు కృతజ్ఞతలు తెలుపరా?

سُبۡحَٰنَ ٱلَّذِي خَلَقَ ٱلۡأَزۡوَٰجَ كُلَّهَا مِمَّا تُنۢبِتُ ٱلۡأَرۡضُ وَمِنۡ أَنفُسِهِمۡ وَمِمَّا لَا يَعۡلَمُونَ

భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన ఆయన (అల్లాహ్) లోపాలకు అతీతుడు.(a)

(a) సృష్టిలో నున్న ప్రతి వస్తువు జతలలో ఉన్నది. అవి జీవులు కానీ, నిర్జీవులు కానీ. జీవరాసులలో మరియు వృక్షరాసులలో ఆడ-మగ; చీకటి-వెలుగులు, చలి-వేడి, విద్యుచ్ఛక్తి మరియు అయస్కాంతాలలో ఉన్న ఆకర్షణా (+) మరియు వికర్షణా (-) శక్తులు, మొదలైనవి. కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే ఏకైకుడు.
భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన ఆయన (అల్లాహ్) లోపాలకు అతీతుడు.(a)

وَءَايَةٞ لَّهُمُ ٱلَّيۡلُ نَسۡلَخُ مِنۡهُ ٱلنَّهَارَ فَإِذَا هُم مُّظۡلِمُونَ

మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి; మేము దానిపై నుండి పగటిని (వెలుగును) తొలగించి నప్పుడు, వారిని చీకటి ఆవరించుకుంటుంది.

وَٱلشَّمۡسُ تَجۡرِي لِمُسۡتَقَرّٖ لَّهَاۚ ذَٰلِكَ تَقۡدِيرُ ٱلۡعَزِيزِ ٱلۡعَلِيمِ

మరియు సూర్యుడు తన నిర్ణీత పరిధిలో, నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియమావళి.

وَٱلۡقَمَرَ قَدَّرۡنَٰهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَٱلۡعُرۡجُونِ ٱلۡقَدِيمِ

మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జురపు మట్ట వలే అయిపోతాడు.

لَا ٱلشَّمۡسُ يَنۢبَغِي لَهَآ أَن تُدۡرِكَ ٱلۡقَمَرَ وَلَا ٱلَّيۡلُ سَابِقُ ٱلنَّهَارِۚ وَكُلّٞ فِي فَلَكٖ يَسۡبَحُونَ

చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు. మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు. మరియు అవన్నీ తమ తమ కక్ష్యలలో సంచరిస్తూ ఉంటాయి.

وَءَايَةٞ لَّهُمۡ أَنَّا حَمَلۡنَا ذُرِّيَّتَهُمۡ فِي ٱلۡفُلۡكِ ٱلۡمَشۡحُونِ

వారికి మరొక సూచన ఏమిటంటే, నిశ్చయంగా, మేము వారి సంతతిని (నూహ్ యొక్క) నిండు నావ లోనికి ఎక్కించాము.

وَخَلَقۡنَا لَهُم مِّن مِّثۡلِهِۦ مَا يَرۡكَبُونَ

మరియు మేము వారు ఎక్కి ప్రయాణం చేయటానికి, ఇటువంటి వాటిని ఎన్నో సృష్టించాము. (a)

(a) చూడండి, 16:8.
మరియు మేము వారు ఎక్కి ప్రయాణం చేయటానికి, ఇటువంటి వాటిని ఎన్నో సృష్టించాము. (a)

وَإِن نَّشَأۡ نُغۡرِقۡهُمۡ فَلَا صَرِيخَ لَهُمۡ وَلَا هُمۡ يُنقَذُونَ

మరియు మేము కోరినట్లయితే, వారిని ముంచి వేసే వారము; అప్పుడు వారి కేకలు వినేవాడెవడూ ఉండడు మరియు వారు రక్షింపబడనూ లేరు -

إِلَّا رَحۡمَةٗ مِّنَّا وَمَتَٰعًا إِلَىٰ حِينٖ

మేము కరుణిస్తే తప్ప - మరియు మేము కొంత కాలం వరకు వారికి వ్యవధినిస్తే తప్ప!

وَإِذَا قِيلَ لَهُمُ ٱتَّقُواْ مَا بَيۡنَ أَيۡدِيكُمۡ وَمَا خَلۡفَكُمۡ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ

మరియు వారితో: "మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి,(a) బహుశా మీరు కరుణింప బడవచ్చు!" అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు).

(a) చూడండిమా బైన అయ్ దీకుమ్ వ మా 'ఖల్ ఫకుమ్: పైన ఇచ్చిన తాత్పర్యం నోబుల్ ఖుర్ఆన్ ను అనుసరించి ఉంది. ము'హమ్మద్ జూనాగఢి గారి తాత్పర్యం ఇలా ఉంది: 'మీ వెనుకా ముందు సంభవించే పాపాల నుండి కాపాడుకోండి.'
మరియు వారితో: "మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి,(a) బహుశా మీరు కరుణింప బడవచ్చు!" అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు).

وَمَا تَأۡتِيهِم مِّنۡ ءَايَةٖ مِّنۡ ءَايَٰتِ رَبِّهِمۡ إِلَّا كَانُواْ عَنۡهَا مُعۡرِضِينَ

మరియు వారి ప్రభువు సూచనలలో నుండి, వారి వద్దకు ఏ సూచన వచ్చినా, వారు దాని నుండి ముఖం త్రిప్పుకోకుండా ఉండలేదు.

وَإِذَا قِيلَ لَهُمۡ أَنفِقُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ قَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُوٓاْ أَنُطۡعِمُ مَن لَّوۡ يَشَآءُ ٱللَّهُ أَطۡعَمَهُۥٓ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٖ مُّبِينٖ

మరియు వారితో: "అల్లాహ్ మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేయండి." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "ఏమీ? అల్లాహ్ కోరితే, తానే తినిపించగల వారికి, మేము తినిపించాలా? మీరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు."

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلۡوَعۡدُ إِن كُنتُمۡ صَٰدِقِينَ

వారు ఇంకా ఇలా అంటారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం (పునరుత్థానం) ఎప్పుడు పూర్తి కానున్నది?"

مَا يَنظُرُونَ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ تَأۡخُذُهُمۡ وَهُمۡ يَخِصِّمُونَ

వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్ద ధ్వని(a) కొరకే. మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే, అది వారిని చిక్కించుకుంటుంది.

(a) అంటే అతస్మాత్తుగా ఊదబడే పునరుత్థానదినపు బాకా (కొమ్ము) ధ్వని, అరుపు, గర్జన లేక శబ్దం. దీనిని మొదటి బాకా లేక నఫ్'ఖతుల్ ఫజ'అ అంటారు. దీని తరువాత రెండవ బాకా ఊదబడుతుంది. దానిని నఫ్'ఖతు 'స్స'అఖ్, అంటారు. అప్పుడు అల్లాహ్ (సు.తా.) తప్ప సర్వజీవరాసులు మరణిస్తారు. ఇంకా చూడండి, 36:29, 53; 38:15.
వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్ద ధ్వని(a) కొరకే. మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే, అది వారిని చిక్కించుకుంటుంది.

فَلَا يَسۡتَطِيعُونَ تَوۡصِيَةٗ وَلَآ إِلَىٰٓ أَهۡلِهِمۡ يَرۡجِعُونَ

వారు ఏ విధమైన వీలునామా కూడా వ్రాయలేరు మరియు తమ కుటుంబం వారి వద్దకు కూడా తిరిగి పోలేరు.

وَنُفِخَ فِي ٱلصُّورِ فَإِذَا هُم مِّنَ ٱلۡأَجۡدَاثِ إِلَىٰ رَبِّهِمۡ يَنسِلُونَ

మరియు (మరొకసారి) బాకా ఊదబడి నప్పుడు, వారంతా గోరీల నుండి (లేచి) తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు.(a)

(a) కొందరు వ్యాఖ్యాతలు దీనిని రెండవ బాకా అని, మరికొందరు దీనిని మూడవ బాకా అంటే నఫ్'ఖతుల్-బ'అసి 'వన్నుషూర్ అని అంటారు. ఇది ఊదబడగానే గోరీలలోని వారంతా లేచి వస్తారు. (ఇబ్నె-కసీ'ర్).
మరియు (మరొకసారి) బాకా ఊదబడి నప్పుడు, వారంతా గోరీల నుండి (లేచి) తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు.(a)

قَالُواْ يَٰوَيۡلَنَا مَنۢ بَعَثَنَا مِن مَّرۡقَدِنَاۜۗ هَٰذَا مَا وَعَدَ ٱلرَّحۡمَٰنُ وَصَدَقَ ٱلۡمُرۡسَلُونَ

వారంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు?" (వారితో అనబడుతుంది): "ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు!"

إِن كَانَتۡ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ فَإِذَا هُمۡ جَمِيعٞ لَّدَيۡنَا مُحۡضَرُونَ

అది కేవలం ఒక పెద్ద ధ్వని(a) మాత్రమే అయి ఉంటుంది! వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు!

(a) ఇది పునరుత్థాన దినమున ఇస్రాఫీల్ ('అ.స.) ఊదే బాకా ధ్వని.
అది కేవలం ఒక పెద్ద ధ్వని(a) మాత్రమే అయి ఉంటుంది! వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు!

فَٱلۡيَوۡمَ لَا تُظۡلَمُ نَفۡسٞ شَيۡـٔٗا وَلَا تُجۡزَوۡنَ إِلَّا مَا كُنتُمۡ تَعۡمَلُونَ

ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరుగదు. మరియు మీ కర్మలకు తగినది తప్ప, మరే ప్రతిఫలమివ్వబడదు.

إِنَّ أَصۡحَٰبَ ٱلۡجَنَّةِ ٱلۡيَوۡمَ فِي شُغُلٖ فَٰكِهُونَ

నిశ్చయంగా, ఆ రోజు స్వర్గవాసులు సుఖసంతోషాలలో నిమగ్నులై ఉంటారు.

هُمۡ وَأَزۡوَٰجُهُمۡ فِي ظِلَٰلٍ عَلَى ٱلۡأَرَآئِكِ مُتَّكِـُٔونَ

వారు మరియు వారి సహవాసులు (అజ్వాజ్), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు.(a)

(a) చూడండి, 4:57, 18:31 మరియు 55:4..
వారు మరియు వారి సహవాసులు (అజ్వాజ్), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు.(a)

لَهُمۡ فِيهَا فَٰكِهَةٞ وَلَهُم مَّا يَدَّعُونَ

అందులో వారికి ఫలాలు మరియు వారు కోరే వన్నీ ఉంటాయి.

سَلَٰمٞ قَوۡلٗا مِّن رَّبّٖ رَّحِيمٖ

"మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి.(a)

(a) చూడండి, 5:16.
"మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి.(a)

وَٱمۡتَٰزُواْ ٱلۡيَوۡمَ أَيُّهَا ٱلۡمُجۡرِمُونَ

ఇంకా (ఇలా అనబడుతుంది): "ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి." (1/8) (a)

(a) చూడండి, 30:14, 43.
ఇంకా (ఇలా అనబడుతుంది): "ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి." (1/8) (a)

۞ أَلَمۡ أَعۡهَدۡ إِلَيۡكُمۡ يَٰبَنِيٓ ءَادَمَ أَن لَّا تَعۡبُدُواْ ٱلشَّيۡطَٰنَۖ إِنَّهُۥ لَكُمۡ عَدُوّٞ مُّبِينٞ

"ఓ ఆదమ్ సంతతివారలారా: 'షైతానును ఆరాధించకండి' అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!" (a)

(a) చూడండి, 19:44.
"ఓ ఆదమ్ సంతతివారలారా: 'షైతానును ఆరాధించకండి' అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!" (a)

وَأَنِ ٱعۡبُدُونِيۚ هَٰذَا صِرَٰطٞ مُّسۡتَقِيمٞ

"మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే ఋమార్గమనీ!"

وَلَقَدۡ أَضَلَّ مِنكُمۡ جِبِلّٗا كَثِيرًاۖ أَفَلَمۡ تَكُونُواْ تَعۡقِلُونَ

"మరియు వాస్తవానికి వాడు (షైతాన్) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా?"

هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِي كُنتُمۡ تُوعَدُونَ

"మీకు వాగ్దానం చేయబడిన ఆ నరకం ఇదే!"

"మీకు వాగ్దానం చేయబడిన ఆ నరకం ఇదే!"

ٱصۡلَوۡهَا ٱلۡيَوۡمَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ

"మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నందుకు, ఈ రోజు దీనిలో ప్రవేశించండి (కాలండి)."

ٱلۡيَوۡمَ نَخۡتِمُ عَلَىٰٓ أَفۡوَٰهِهِمۡ وَتُكَلِّمُنَآ أَيۡدِيهِمۡ وَتَشۡهَدُ أَرۡجُلُهُم بِمَا كَانُواْ يَكۡسِبُونَ

ఆ రోజు మేము వారి నోళ్ళ మీద ముద్ర వేస్తాము.(a) మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి.

(a) ఎందుకంటే మొదట వారు తాము చేసిన షిర్కును తిరస్కరిస్తారు. చూడండి, 6:23.
ఆ రోజు మేము వారి నోళ్ళ మీద ముద్ర వేస్తాము.(a) మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి.

وَلَوۡ نَشَآءُ لَطَمَسۡنَا عَلَىٰٓ أَعۡيُنِهِمۡ فَٱسۡتَبَقُواْ ٱلصِّرَٰطَ فَأَنَّىٰ يُبۡصِرُونَ

మరియు మేము కోరినట్లయితే, వారి దృష్టిని నిర్మూలించే వారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడే వారు, కాని వారు ఎలా చూడగలిగే వారు?(a)

(a) చూడండి, 2:20.
మరియు మేము కోరినట్లయితే, వారి దృష్టిని నిర్మూలించే వారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడే వారు, కాని వారు ఎలా చూడగలిగే వారు?(a)

وَلَوۡ نَشَآءُ لَمَسَخۡنَٰهُمۡ عَلَىٰ مَكَانَتِهِمۡ فَمَا ٱسۡتَطَٰعُواْ مُضِيّٗا وَلَا يَرۡجِعُونَ

మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచే వారం, అప్పుడు వారు ముందుకూ పోలేరు మరియు వెనుకకూ మరలలేరు.

وَمَن نُّعَمِّرۡهُ نُنَكِّسۡهُ فِي ٱلۡخَلۡقِۚ أَفَلَا يَعۡقِلُونَ

మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతని శారీరక రూపాన్ని మార్చుతాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా? (a)

(a) చూడండి, 4:28.
మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతని శారీరక రూపాన్ని మార్చుతాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా? (a)

وَمَا عَلَّمۡنَٰهُ ٱلشِّعۡرَ وَمَا يَنۢبَغِي لَهُۥٓۚ إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ وَقُرۡءَانٞ مُّبِينٞ

మరియు మేము అతనికి (ముహమ్మద్ కు) కవిత్వం నేర్పలేదు.(a) మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్ఆన్) మాత్రమే. (b)

(a) మక్కా ముష్రికులు దైవప్రవక్త ('స'అస) ను వివిధ ఆరోపణలతో పీడించేవారు. వాటిలో ఒకటి ఇతను ('స'అస) కవిత్వం చెబుతున్నాడని. దానికి అల్లాహ్ (సు.తా.) ఇక్కడ జవాబిస్తున్నాడు: ఒకవేళ ఇది కవిత్వం అయితే మీరు దీని వంటి ఒక్క సూరహ్ నైనా రచించి తీసుకురండని. కాని దానిని ఎవ్వరూ ఈ రోజు వరకు పూర్తి చేయలేక పోయారు. ఇంకా చూడండి, 26:224-226. (b) చూడండి, 15:1
మరియు మేము అతనికి (ముహమ్మద్ కు) కవిత్వం నేర్పలేదు.(a) మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్ఆన్) మాత్రమే. (b)

لِّيُنذِرَ مَن كَانَ حَيّٗا وَيَحِقَّ ٱلۡقَوۡلُ عَلَى ٱلۡكَٰفِرِينَ

బ్రతికి వున్న ప్రతివానికి హెచ్చరిక చేయటానికి మరియు సత్యతిరస్కారుల ఎడల మా ఆదేశాన్ని నిరూపించటానికి!

أَوَلَمۡ يَرَوۡاْ أَنَّا خَلَقۡنَا لَهُم مِّمَّا عَمِلَتۡ أَيۡدِينَآ أَنۡعَٰمٗا فَهُمۡ لَهَا مَٰلِكُونَ

ఏమీ, వారికి తెలియదా? నిశ్చయంగా, మేము వారికి వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, తరువాత వాటిపై వారికి యాజమాన్యం ఇచ్చామని?

وَذَلَّلۡنَٰهَا لَهُمۡ فَمِنۡهَا رَكُوبُهُمۡ وَمِنۡهَا يَأۡكُلُونَ

మరియు వాటిని, వారికి స్వాధీనపరిచాము. కావున వాటిలో కొన్నిటిపై వారు స్వారీ చేస్తారు, మరికొన్నిటిని (వాటి మాంసాన్ని) వారు తింటారు.

وَلَهُمۡ فِيهَا مَنَٰفِعُ وَمَشَارِبُۚ أَفَلَا يَشۡكُرُونَ

మరియు వాటిలో వారికి ఎన్నో ప్రయోజనాలు మరియు పానీయాలు (పాలు) ఉన్నాయి. అయినా, వారెందుకు కృతజ్ఞతలు చూపరు?

وَٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ ءَالِهَةٗ لَّعَلَّهُمۡ يُنصَرُونَ

మరియు వారు అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు.(a) బహుశా వారి వలన తమకు సహాయం దొరకుతుందేమోననే ఆశతో!

(a) అంటే విగ్రహాలు, కల్పితదైవాలు, అవతారాలుగా భావించబడే మానవులు, సాధులు, ,సన్యాసులు, ప్రవక్తలు, షై'తాన్ మరియు దైవదూతలూ లేక ధనసంపత్తులు, బలం, శక్తి, అదృష్టం, శకునం మొదలైనవి. వీటినే వారు దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారు.
మరియు వారు అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు.(a) బహుశా వారి వలన తమకు సహాయం దొరకుతుందేమోననే ఆశతో!

لَا يَسۡتَطِيعُونَ نَصۡرَهُمۡ وَهُمۡ لَهُمۡ جُندٞ مُّحۡضَرُونَ

వారు (ఆ దైవాలు), తమకెలాంటి సహాయ చేయలేరు. అయినా! వీరు (సత్యతిరస్కారులు) వారి (ఆ దైవాల) కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు.(a)

(a) ఈ ఆయత్ యొక్క మరొక తాత్పర్యం ఈ విధంగా కూడా ఉంది: "వారు (ఆ దైవాలు), వీరికెలాంటి సహాయం చేయలేరు. కాని వారు (ఆ దైవాలు పునరుత్థాన దినమున తమను ఆరాధించిన వారికి) విరుద్ధ భటులుగా హాజరు చేయబడతారు." (ఇబ్నె-కసీ'ర్)
వారు (ఆ దైవాలు), తమకెలాంటి సహాయ చేయలేరు. అయినా! వీరు (సత్యతిరస్కారులు) వారి (ఆ దైవాల) కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు.(a)

فَلَا يَحۡزُنكَ قَوۡلُهُمۡۘ إِنَّا نَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَ

కావున (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవి మరియు వెలిబుచ్చేవీ అన్నీ బాగా తెలుసు.

أَوَلَمۡ يَرَ ٱلۡإِنسَٰنُ أَنَّا خَلَقۡنَٰهُ مِن نُّطۡفَةٖ فَإِذَا هُوَ خَصِيمٞ مُّبِينٞ

ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు? (a)

(a) ఇటువంటి ఆయత్ కు చూడండి, 16:4.
ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు? (a)

وَضَرَبَ لَنَا مَثَلٗا وَنَسِيَ خَلۡقَهُۥۖ قَالَ مَن يُحۡيِ ٱلۡعِظَٰمَ وَهِيَ رَمِيمٞ

మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?"

قُلۡ يُحۡيِيهَا ٱلَّذِيٓ أَنشَأَهَآ أَوَّلَ مَرَّةٖۖ وَهُوَ بِكُلِّ خَلۡقٍ عَلِيمٌ

ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది."

ٱلَّذِي جَعَلَ لَكُم مِّنَ ٱلشَّجَرِ ٱلۡأَخۡضَرِ نَارٗا فَإِذَآ أَنتُم مِّنۡهُ تُوقِدُونَ

ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు.

أَوَلَيۡسَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يَخۡلُقَ مِثۡلَهُمۚ بَلَىٰ وَهُوَ ٱلۡخَلَّٰقُ ٱلۡعَلِيمُ

ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు.(a)

(a) చూడండి, 40:57, 46:33 17:99.
ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు.(a)

إِنَّمَآ أَمۡرُهُۥٓ إِذَآ أَرَادَ شَيۡـًٔا أَن يَقُولَ لَهُۥ كُن فَيَكُونُ

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! అది అయిపోతుంది.

فَسُبۡحَٰنَ ٱلَّذِي بِيَدِهِۦ مَلَكُوتُ كُلِّ شَيۡءٖ وَإِلَيۡهِ تُرۡجَعُونَ

ఎందుకంటే! సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) చేతిలో ప్రతిదానికి సంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.

Footer Include