Header Include

Telugu translation - Abder-Rahim ibn Muhammad

Translation of the Quran meanings into Telugu by Maulana Abder-Rahim ibn Muhammad.

QR Code https://quran.islamcontent.com/te/telugu_muhammad

حمٓ

హా-మీమ్.

హా-మీమ్.

تَنزِيلُ ٱلۡكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡعَلِيمِ

ఈ గ్రంథ (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.

غَافِرِ ٱلذَّنۢبِ وَقَابِلِ ٱلتَّوۡبِ شَدِيدِ ٱلۡعِقَابِ ذِي ٱلطَّوۡلِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ إِلَيۡهِ ٱلۡمَصِيرُ

పాపాలను క్షమించేవాడు (a) మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, (b) ఎంతో ఉదార స్వభావుడు. (c) ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరి) మరలింపు ఆయన వైపుకే ఉంది!

(a) అల్-'గాఫిర్ : Oft-Forgiving, Most Forgiving. క్షమాగుణ పరిపూర్ణుడు, పాపాలను క్షమించేవాడు, ఎక్కువగా క్షమించేవాడు. ఇంకా చూడండి, అల్-'గఫ్ఫారు: క్షమించేవాడు, 20:82; అల్-'గఫూరు : 2:173. (b) చూడండి, 8:52, 15:50. (c) జి'-'త్తౌలు: అంటే Bestorwer of Favours, ఎంతో ఉదారస్వభావుడు, దాతృత్వుడు, ధనసంపత్తులు ప్రసాదించేవాడు, లేక తన దాసులను అనుగ్రహించేవాడు.
పాపాలను క్షమించేవాడు (a) మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, (b) ఎంతో ఉదార స్వభావుడు. (c) ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరి) మరలింపు ఆయన వైపుకే ఉంది!

مَا يُجَٰدِلُ فِيٓ ءَايَٰتِ ٱللَّهِ إِلَّا ٱلَّذِينَ كَفَرُواْ فَلَا يَغۡرُرۡكَ تَقَلُّبُهُمۡ فِي ٱلۡبِلَٰدِ

సత్యతిరస్కారులు తప్ప, ఇతరులెవ్వరూ అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి వాదించరు, కావున భూమిలో వారి గర్వపూరితమైన నడక నిన్ను మోసగింపనివ్వరాదు!

كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ وَٱلۡأَحۡزَابُ مِنۢ بَعۡدِهِمۡۖ وَهَمَّتۡ كُلُّ أُمَّةِۭ بِرَسُولِهِمۡ لِيَأۡخُذُوهُۖ وَجَٰدَلُواْ بِٱلۡبَٰطِلِ لِيُدۡحِضُواْ بِهِ ٱلۡحَقَّ فَأَخَذۡتُهُمۡۖ فَكَيۡفَ كَانَ عِقَابِ

వారికి పూర్వం గడిచిన నూహ్ జాతి వారూ మరియు వారి పిదప వచ్చిన ఇతర వర్గాల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. మరియు ప్రతి సమాజం వారు తమ సందేశహరుణ్ణి నిర్భంధించటానికి ప్రయత్నాలు చేశారు. మరియు అసత్యంతో సత్యాన్ని ఖండించటానికి వాదులాడారు; కావున చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూశారా! నా శిక్ష ఎలా ఉండిందో!

وَكَذَٰلِكَ حَقَّتۡ كَلِمَتُ رَبِّكَ عَلَى ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّهُمۡ أَصۡحَٰبُ ٱلنَّارِ

మరియు ఈ విధంగా సత్యతిరస్కారానికి పాల్పడిన వారిని గురించి: "నిశ్చయంగా వారు నరకవాసులు." అని, అన్న నీ ప్రభువు వాక్కు సత్యమయ్యింది.

ٱلَّذِينَ يَحۡمِلُونَ ٱلۡعَرۡشَ وَمَنۡ حَوۡلَهُۥ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيُؤۡمِنُونَ بِهِۦ وَيَسۡتَغۡفِرُونَ لِلَّذِينَ ءَامَنُواْۖ رَبَّنَا وَسِعۡتَ كُلَّ شَيۡءٖ رَّحۡمَةٗ وَعِلۡمٗا فَٱغۡفِرۡ لِلَّذِينَ تَابُواْ وَٱتَّبَعُواْ سَبِيلَكَ وَقِهِمۡ عَذَابَ ٱلۡجَحِيمِ

సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. (a) మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: "ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!"

(a) చూడండి, 7:54 మరియు 39:75.

رَبَّنَا وَأَدۡخِلۡهُمۡ جَنَّٰتِ عَدۡنٍ ٱلَّتِي وَعَدتَّهُمۡ وَمَن صَلَحَ مِنۡ ءَابَآئِهِمۡ وَأَزۡوَٰجِهِمۡ وَذُرِّيَّٰتِهِمۡۚ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

"ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింపజేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసులలో (అజ్వాజ్ లలో) మరియు వారి సంతానంలో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు." (a)

(a) చూడండి, 52:21.

وَقِهِمُ ٱلسَّيِّـَٔاتِۚ وَمَن تَقِ ٱلسَّيِّـَٔاتِ يَوۡمَئِذٖ فَقَدۡ رَحِمۡتَهُۥۚ وَذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ

"మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)." (a)

(a) పై మూడు ఆయత్ లలో విశ్వాసుల కొరకు రెండు శుభవార్తలు ఉన్నాయి. 1) దైవదూతలు ('అలైహిమ్. స.) వారికై ప్రార్థనలు చేస్తూ ఉంటారు. 2) విశ్వాసుల కుటుంబీకులందరూ స్వర్గంలో ఒకే చోట ఉంటారు.
"మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)." (a)

إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ يُنَادَوۡنَ لَمَقۡتُ ٱللَّهِ أَكۡبَرُ مِن مَّقۡتِكُمۡ أَنفُسَكُمۡ إِذۡ تُدۡعَوۡنَ إِلَى ٱلۡإِيمَٰنِ فَتَكۡفُرُونَ

నిశ్చయంగా, (ఆ రోజు) సత్యతిరస్కారులను పిలిచి వారితో: "ఈరోజు మీకు, మీ పట్ల ఎంత అసహ్యం కలుగుతున్నదో! మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించినపుడు, అల్లాహ్ కు మీ పట్ల ఇంత కంటే ఎక్కువ అసహ్యం కలిగేది!" అని అనబడుతుంది.

قَالُواْ رَبَّنَآ أَمَتَّنَا ٱثۡنَتَيۡنِ وَأَحۡيَيۡتَنَا ٱثۡنَتَيۡنِ فَٱعۡتَرَفۡنَا بِذُنُوبِنَا فَهَلۡ إِلَىٰ خُرُوجٖ مِّن سَبِيلٖ

వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు. (a) ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయట పడే మార్గం ఏదైనా ఉందా?"

(a) చూడండి, 2:28 రెండు మరణాలు అంటే మొదటిది మానవుడు ఉనికిలోకి రాకముందు ఉన్న స్థితి. రెండవది భూలోక జీవితంలో మరణించటం. రెండు జీవితాలంటే మొదటిది భూలోక జీవితం, రెండవది పరలోక జీవితం. వ్యాఖ్యాతలందరూ ఈ విశదీకరణతో ఏకీభవిస్తున్నారు.
వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు. (a) ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయట పడే మార్గం ఏదైనా ఉందా?"

ذَٰلِكُم بِأَنَّهُۥٓ إِذَا دُعِيَ ٱللَّهُ وَحۡدَهُۥ كَفَرۡتُمۡ وَإِن يُشۡرَكۡ بِهِۦ تُؤۡمِنُواْۚ فَٱلۡحُكۡمُ لِلَّهِ ٱلۡعَلِيِّ ٱلۡكَبِيرِ

(వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది): "దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్ ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగస్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వసించారు! ఇప్పుడు తీర్పు మహోన్నతుడు, మహనీయుడు (a) అయిన అల్లాహ్ చేతిలో ఉంది." (b)

(a) చూడండి, 4:34. (b) దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: తీర్పుదినమున స్వర్గానికి అర్హులైన వారు స్వర్గానికి పంపబడతారు. నరకానికి అర్హులైన వారు నరకానికి. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) అంటాడు : 'ఎవని హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉందో అతనిని నరకం నుండి తీయండి.' అప్పుడు వారు తీయబడతారు. వారు కాలి నల్లబడిపోయి ఉంటారు. వారు జీవనదిలోకి త్రోయబడతారు. వారు నది ఒడ్డున మొగ్గలు అంకురించినట్లు, అంకురించి బయటికి వస్తారు. (అబూ సయీద్ అల్-ఖుద్రీ కథనం; బు'ఖారీ, ముస్లిం, నసాయి', మరియు ఇబ్నె 'హంబల్) ఈ విధంగా కొంతైనా విశ్వాసమున్నవారు క్షమింపబడతారు.
(వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది): "దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్ ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగస్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వసించారు! ఇప్పుడు తీర్పు మహోన్నతుడు, మహనీయుడు (a) అయిన అల్లాహ్ చేతిలో ఉంది." (b)

هُوَ ٱلَّذِي يُرِيكُمۡ ءَايَٰتِهِۦ وَيُنَزِّلُ لَكُم مِّنَ ٱلسَّمَآءِ رِزۡقٗاۚ وَمَا يَتَذَكَّرُ إِلَّا مَن يُنِيبُ

ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప, ఇతరులు వీటిని గ్రహించలేరు.

فَٱدۡعُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ

కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించుకొని, అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి. సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా!

رَفِيعُ ٱلدَّرَجَٰتِ ذُو ٱلۡعَرۡشِ يُلۡقِي ٱلرُّوحَ مِنۡ أَمۡرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦ لِيُنذِرَ يَوۡمَ ٱلتَّلَاقِ

ఆయన మహోన్నతమైన స్థానాలు గలవాడు, (a) (సర్వాధికార) సింహాసనానికి (అర్ష్ కు) అధిపతి, (b) తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై, తన ఆజ్ఞ ప్రకారం, తన దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) అవతరింపజేస్తాడు, ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి.

(a) రఫీ'ఉ: Exalted, ఉన్నత స్థానాలు గలవాడు, అర్-రాఫి'ఉ: (సేకరించబడిన పదం) The Exalter, of the believer by prospering him. Exalter of the obedient. విశ్వాసులను ఉన్నత స్థాయిలోకి ఎత్తువాడు, పైకెత్తేవాడు లేక విధేయులను ప్రశంసించువాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
ఆయన మహోన్నతమైన స్థానాలు గలవాడు, (a) (సర్వాధికార) సింహాసనానికి (అర్ష్ కు) అధిపతి, (b) తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై, తన ఆజ్ఞ ప్రకారం, తన దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) అవతరింపజేస్తాడు, ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి.

يَوۡمَ هُم بَٰرِزُونَۖ لَا يَخۡفَىٰ عَلَى ٱللَّهِ مِنۡهُمۡ شَيۡءٞۚ لِّمَنِ ٱلۡمُلۡكُ ٱلۡيَوۡمَۖ لِلَّهِ ٱلۡوَٰحِدِ ٱلۡقَهَّارِ

ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ (a) అయిన అల్లాహ్ దే!

(a) అల్-ఖహ్హారు: తన సృష్టిపై సంపూర్ణ అధికారం, ఆధిపత్యం గలవాడు, లోబరచుకొనేవాడు, ప్రజలుడు. అల్-ఖాహిరుకు.చూడండి 6:18, 61. అల్ వా'హిద్ కు చూడండి 2:133.
ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ (a) అయిన అల్లాహ్ దే!

ٱلۡيَوۡمَ تُجۡزَىٰ كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡۚ لَا ظُلۡمَ ٱلۡيَوۡمَۚ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ

ఆ రోజు ప్రతి ప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరుగదు. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.

وَأَنذِرۡهُمۡ يَوۡمَ ٱلۡأٓزِفَةِ إِذِ ٱلۡقُلُوبُ لَدَى ٱلۡحَنَاجِرِ كَٰظِمِينَۚ مَا لِلظَّٰلِمِينَ مِنۡ حَمِيمٖ وَلَا شَفِيعٖ يُطَاعُ

మరియు (ఓ ముహమ్మద్!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతుల వరకు వచ్చి అడ్డుకొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆ రోజు) దుర్మార్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసేవాడు గానీ,(a) ఎవ్వడూ ఉండడు.

(a) సిఫారసుకు చూడండి, 10:3.
మరియు (ఓ ముహమ్మద్!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతుల వరకు వచ్చి అడ్డుకొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆ రోజు) దుర్మార్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసేవాడు గానీ,(a) ఎవ్వడూ ఉండడు.

يَعۡلَمُ خَآئِنَةَ ٱلۡأَعۡيُنِ وَمَا تُخۡفِي ٱلصُّدُورُ

ఆయన (అల్లాహ్)కు, చూపులలోని నమ్మకద్రోహం మరియు హృదయాలలో దాగివున్న రహస్యాలు అన్నీ తెలుసు.

وَٱللَّهُ يَقۡضِي بِٱلۡحَقِّۖ وَٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِۦ لَا يَقۡضُونَ بِشَيۡءٍۗ إِنَّ ٱللَّهَ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ

మరియు అల్లాహ్, న్యాయంగా తీర్పు చేస్తాడు. మరియు వారు ఆయనను (అల్లాహ్ ను) వదలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి తీర్పు చేయలేరు. నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

۞ أَوَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ كَانُواْ مِن قَبۡلِهِمۡۚ كَانُواْ هُمۡ أَشَدَّ مِنۡهُمۡ قُوَّةٗ وَءَاثَارٗا فِي ٱلۡأَرۡضِ فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمۡ وَمَا كَانَ لَهُم مِّنَ ٱللَّهِ مِن وَاقٖ

ఏమీ? వారు భూమిలో సంచారం చేసి తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు, వీరి కంటే ఎక్కువ బలం గలవారు. మరియు వీరి కంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలి పోయారు; కాని అల్లాహ్ వారి పాపాలకుగానూ వారిని పట్టుకున్నాడు మరియు అప్పుడు వారిని అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేక పోయాడు.

ذَٰلِكَ بِأَنَّهُمۡ كَانَت تَّأۡتِيهِمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَكَفَرُواْ فَأَخَذَهُمُ ٱللَّهُۚ إِنَّهُۥ قَوِيّٞ شَدِيدُ ٱلۡعِقَابِ

ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారిని శిక్షకు గురి చేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు.

وَلَقَدۡ أَرۡسَلۡنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَا وَسُلۡطَٰنٖ مُّبِينٍ

మరియు వాస్తవంగా, మేము మూసాను మా సూచనలతో (ఆయాత్ లతో) మరియు స్పష్టమైన అధికారంతో పంపి ఉన్నాము;

إِلَىٰ فِرۡعَوۡنَ وَهَٰمَٰنَ وَقَٰرُونَ فَقَالُواْ سَٰحِرٞ كَذَّابٞ

ఫిర్ఔన్, హామాన్ మరియు ఖారూన్ ల (a) వద్దకు! కాని వారు: "ఇతను మాంత్రికుడు, అసత్యవాది!" అని అన్నారు.

(a) ఖారూన్, మొదట మూసా ('అ.స.) ను అనుసరించాడు. తరువాత అవిశ్వాసుడయ్యాడు. వివరాలకు చూడండి, 28:76. హామాన్, కొరకు చూడండి 28:6, అతడు ఫిర్'ఔన్ సభలో మంత్రిగా ఉండేవాడు.
ఫిర్ఔన్, హామాన్ మరియు ఖారూన్ ల (a) వద్దకు! కాని వారు: "ఇతను మాంత్రికుడు, అసత్యవాది!" అని అన్నారు.

فَلَمَّا جَآءَهُم بِٱلۡحَقِّ مِنۡ عِندِنَا قَالُواْ ٱقۡتُلُوٓاْ أَبۡنَآءَ ٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ وَٱسۡتَحۡيُواْ نِسَآءَهُمۡۚ وَمَا كَيۡدُ ٱلۡكَٰفِرِينَ إِلَّا فِي ضَلَٰلٖ

తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొని రాగా వారన్నారు: "ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." (a) కాని సత్యతిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి.

(a) ఫిర్ఔ'న్, మూసా ('అ.స.) జన్మానికి ముందు కూడా తాను బానిసలుగా చేసి ఉంచిన బనీ-ఇస్రాయీ'ల్ సంతతి వారి మగ సంతానాన్ని పుట్టిన పెంటనే చంపిస్తూ ఉండేవాడు. ఎందుకంటే వారి సంతతిలోని బాలుడు అతని నాశనానికి కారకుడవుతాడని, అతనికి జ్యోతిష్యులు చెప్పి ఉంటారు. ఈసారి మూసా ('అ.స.) మరియు అతని సంతతి వారి మధ్య అవిశ్వాసం, కలహాలు రేకెత్తించే ఉద్దేశ్యంతో వారి పుత్రులను చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారు పలికిన మాటలకు చూడండి, 7:129.
తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొని రాగా వారన్నారు: "ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." (a) కాని సత్యతిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి.

وَقَالَ فِرۡعَوۡنُ ذَرُونِيٓ أَقۡتُلۡ مُوسَىٰ وَلۡيَدۡعُ رَبَّهُۥٓۖ إِنِّيٓ أَخَافُ أَن يُبَدِّلَ دِينَكُمۡ أَوۡ أَن يُظۡهِرَ فِي ٱلۡأَرۡضِ ٱلۡفَسَادَ

మరియు ఫిర్ఔన్ ఇలా అన్నాడు: "మూసాను చంపే పని నాకు వదలి పెట్టండి; అతనిని తన ప్రభువును పిలుచుకోనివ్వండి. వాస్తవానికి, నా భయమేమిటంటే, అతను మీ ధర్మాన్ని మార్చవచ్చు, లేదా దేశంలో కల్లోల్లాన్ని రేకెత్తించవచ్చు!"

وَقَالَ مُوسَىٰٓ إِنِّي عُذۡتُ بِرَبِّي وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٖ لَّا يُؤۡمِنُ بِيَوۡمِ ٱلۡحِسَابِ

మరియు మూసా అన్నాడు: "నిశ్చయంగా, నేను లెక్క తీసుకోబడే రోజును విశ్వసించని ప్రతి దురహంకారి నుండి కాపాడటానికి, నాకూ మరియు మీకూ కూడా ప్రభువైన ఆయన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను!" (a)

(a) ఫిర్ఔ'న్, మూసా ('అ.స.) చెపగోరినప్పుడు అతను ఈ విధంగా ప్రార్థించాడు. దైవప్రవక్త ('స'అస) కూడా తమకు శత్రువుల భయం ఉంటే ఈ దు'ఆ చేసేవారు. ముస్నద్ అ'హ్మద్, 4/415 'ఓ అల్లాహ్ (సు.తా.) మేము నిన్ను వారికి విరుద్ధంగా ఉంచుతున్నాము. మరియు వారి ఆగడాల నుండి నీ రక్షణ కోరుతున్నాము.'
మరియు మూసా అన్నాడు: "నిశ్చయంగా, నేను లెక్క తీసుకోబడే రోజును విశ్వసించని ప్రతి దురహంకారి నుండి కాపాడటానికి, నాకూ మరియు మీకూ కూడా ప్రభువైన ఆయన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను!" (a)

وَقَالَ رَجُلٞ مُّؤۡمِنٞ مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَكۡتُمُ إِيمَٰنَهُۥٓ أَتَقۡتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ ٱللَّهُ وَقَدۡ جَآءَكُم بِٱلۡبَيِّنَٰتِ مِن رَّبِّكُمۡۖ وَإِن يَكُ كَٰذِبٗا فَعَلَيۡهِ كَذِبُهُۥۖ وَإِن يَكُ صَادِقٗا يُصِبۡكُم بَعۡضُ ٱلَّذِي يَعِدُكُمۡۖ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ مُسۡرِفٞ كَذَّابٞ

అప్పుడు తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిర్ఔన్ కుటుంబపు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: (a) "ఏమీ? మీరు, 'అల్లాహ్ యే నా ప్రభువు.' అని అన్నందుకు, ఒక వ్యక్తిని చంపగోరుతున్నారా? వాస్తవానికి, అతను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాడు కదా! మరియు ఒకవేళ అతను అసత్యవాది అయితే, అతని అసత్యం అతని మీదనే పడుతుంది! కాని ఒకవేళ అతను సత్యవంతుడే అయితే, అతను హెచ్చరించే (శిక్ష) మీపై పడవచ్చు కదా! నిశ్చయంగా, అల్లాహ్ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు!"

(a) ఇటువంటి గాథకు చూడండి, 36:20-27.

يَٰقَوۡمِ لَكُمُ ٱلۡمُلۡكُ ٱلۡيَوۡمَ ظَٰهِرِينَ فِي ٱلۡأَرۡضِ فَمَن يَنصُرُنَا مِنۢ بَأۡسِ ٱللَّهِ إِن جَآءَنَاۚ قَالَ فِرۡعَوۡنُ مَآ أُرِيكُمۡ إِلَّا مَآ أَرَىٰ وَمَآ أَهۡدِيكُمۡ إِلَّا سَبِيلَ ٱلرَّشَادِ

ఓ నా జాతి ప్రజలారా! ఈనాడు రాజ్యాధికారం మీదే; దేశంలో మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు, కాని ఒకవేళ అల్లాహ్ శిక్ష మన మీద వచ్చి పడితే, అప్పుడు మనకెవడు సహాయం చేయగలడు?" అప్పుడు ఫిర్ఔన్ అన్నాడు: "నాకు సముచితమైన మార్గమే నేను మీకూ చూపుతాను, నేను మీకు మార్గదర్శకత్వం చేసేది కేవలం సరైన మార్గం వైపునకే!" (a)

(a) ఫిర్'ఔన్ చూపే మార్గం సత్యమైనది కాదు, చూడండి, 11:97.
ఓ నా జాతి ప్రజలారా! ఈనాడు రాజ్యాధికారం మీదే; దేశంలో మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు, కాని ఒకవేళ అల్లాహ్ శిక్ష మన మీద వచ్చి పడితే, అప్పుడు మనకెవడు సహాయం చేయగలడు?" అప్పుడు ఫిర్ఔన్ అన్నాడు: "నాకు సముచితమైన మార్గమే నేను మీకూ చూపుతాను, నేను మీకు మార్గదర్శకత్వం చేసేది కేవలం సరైన మార్గం వైపునకే!" (a)

وَقَالَ ٱلَّذِيٓ ءَامَنَ يَٰقَوۡمِ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُم مِّثۡلَ يَوۡمِ ٱلۡأَحۡزَابِ

మరియు విశ్వసించిన ఆ వ్యక్తి అన్నాడు: "నా జాతి ప్రజలారా! నిశ్చయంగా పూర్వం అనేక సంఘాలకు దాపురించిన దినమే మీకూ దాపురించునేమోనని నేను భయపడుతున్నాను!

مِثۡلَ دَأۡبِ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَٱلَّذِينَ مِنۢ بَعۡدِهِمۡۚ وَمَا ٱللَّهُ يُرِيدُ ظُلۡمٗا لِّلۡعِبَادِ

నూహ్, ఆద్, సమూద్ మరియు వారి తరువాత వచ్చిన జాతుల వారికి వచ్చినటువంటి (దుర్దినం). మరియు అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేయగోరడు.

وَيَٰقَوۡمِ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ يَوۡمَ ٱلتَّنَادِ

మరియు ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి నేను, మీరు పరస్పరం పిలుచుకునే, ఆ దినం (a) గురించి భయపడుతున్నాను."

(a) పునరుత్థాన దినమున స్వర్గవాసులు మరియు నరకవాసులు ఒకరినొకరు పిలుచుకుంటారు, చూడండి, 7:48-49.
మరియు ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి నేను, మీరు పరస్పరం పిలుచుకునే, ఆ దినం (a) గురించి భయపడుతున్నాను."

يَوۡمَ تُوَلُّونَ مُدۡبِرِينَ مَا لَكُم مِّنَ ٱللَّهِ مِنۡ عَاصِمٖۗ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٖ

ఆరోజు మీరు వెనుదిరిగి పారిపోవాలనుకుంటారు, కాని అల్లాహ్ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవ్వడూ ఉండడు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి, మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.

وَلَقَدۡ جَآءَكُمۡ يُوسُفُ مِن قَبۡلُ بِٱلۡبَيِّنَٰتِ فَمَا زِلۡتُمۡ فِي شَكّٖ مِّمَّا جَآءَكُم بِهِۦۖ حَتَّىٰٓ إِذَا هَلَكَ قُلۡتُمۡ لَن يَبۡعَثَ ٱللَّهُ مِنۢ بَعۡدِهِۦ رَسُولٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَنۡ هُوَ مُسۡرِفٞ مُّرۡتَابٌ

మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకొని వచ్చాడు. కాని మీరు అతడు తెచ్చిన వాటిని గురించి సందేహంలో పడ్డారు. చివరకు అతడు మరణించినప్పుడు, మీరన్నారు: "ఇక అల్లాహ్ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు!" (a) ఈ విధంగా అల్లాహ్ మితిమీరి ప్రవర్తించే వారిని, సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.

(a) బహుశా ఈజిప్ట్ లో యూసుఫ్ ('అ.స.) తమ తెగవారైన హిక్సోస్ (Hyksos) వారిలోనే ప్రవక్తగా పరిగణించబడ్డారు. వారు 'అరబ్బులు. హిబ్రూ భాషతో కలిసే భాష మాట్లాడేవారు. ఇతర ప్రజలు అతనిని ప్రవక్తగా ఎంచలేదు.
మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకొని వచ్చాడు. కాని మీరు అతడు తెచ్చిన వాటిని గురించి సందేహంలో పడ్డారు. చివరకు అతడు మరణించినప్పుడు, మీరన్నారు: "ఇక అల్లాహ్ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు!" (a) ఈ విధంగా అల్లాహ్ మితిమీరి ప్రవర్తించే వారిని, సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.

ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِيٓ ءَايَٰتِ ٱللَّهِ بِغَيۡرِ سُلۡطَٰنٍ أَتَىٰهُمۡۖ كَبُرَ مَقۡتًا عِندَ ٱللَّهِ وَعِندَ ٱلَّذِينَ ءَامَنُواْۚ كَذَٰلِكَ يَطۡبَعُ ٱللَّهُ عَلَىٰ كُلِّ قَلۡبِ مُتَكَبِّرٖ جَبَّارٖ

ఎవరైతే అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు అల్లాహ్ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు. ఈ విధంగా అల్లాహ్ దురహంకారీ, నిర్దయుడూ (క్రూరుడు) అయిన ప్రతి వ్యక్తి హృదయం మీద ముద్ర వేస్తాడు.

وَقَالَ فِرۡعَوۡنُ يَٰهَٰمَٰنُ ٱبۡنِ لِي صَرۡحٗا لَّعَلِّيٓ أَبۡلُغُ ٱلۡأَسۡبَٰبَ

మరియు ఫిరఔన్ ఇలా అన్నాడు: "ఓ హామాన్! నా కొరకు ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించు, బహుశా (దాని పైకి ఎక్కి) నేను మార్గాలను పొందవచ్చు.

أَسۡبَٰبَ ٱلسَّمَٰوَٰتِ فَأَطَّلِعَ إِلَىٰٓ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُۥ كَٰذِبٗاۚ وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرۡعَوۡنَ سُوٓءُ عَمَلِهِۦ وَصُدَّ عَنِ ٱلسَّبِيلِۚ وَمَا كَيۡدُ فِرۡعَوۡنَ إِلَّا فِي تَبَابٖ

ఆకాశాలలోనికి వెళ్ళే మార్గాలు! మరియు వాటి ద్వారా నేను మూసా దేవుణ్ణి చూడటానికి. ఎందుకంటే, నిశ్చయంగా, నేను అతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను!" మరియు ఈ విధంగా ఫిరఔన్ కు తన దుష్కార్యాలు మంచివిగా కనబడ్డాయి. మరియు అతడు సన్మార్గం నుండి నిరోధించబడ్డాడు. మరియు ఫిరఔన్ యొక్క ప్రతి పన్నాగం అతనిని నాశనానికి మాత్రమే గురి చేసింది.

وَقَالَ ٱلَّذِيٓ ءَامَنَ يَٰقَوۡمِ ٱتَّبِعُونِ أَهۡدِكُمۡ سَبِيلَ ٱلرَّشَادِ

మరియు విశ్వసించిన ఆ వ్యక్తి ఇంకా ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను.

يَٰقَوۡمِ إِنَّمَا هَٰذِهِ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا مَتَٰعٞ وَإِنَّ ٱلۡأٓخِرَةَ هِيَ دَارُ ٱلۡقَرَارِ

నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఈ ఇహలోక జీవిత సుఖం తాత్కాలికమైనదే మరియు నిశ్చయంగా, పరలోకమే శాశ్వతమైన నివాస స్థలము.

مَنۡ عَمِلَ سَيِّئَةٗ فَلَا يُجۡزَىٰٓ إِلَّا مِثۡلَهَاۖ وَمَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَأُوْلَٰٓئِكَ يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ يُرۡزَقُونَ فِيهَا بِغَيۡرِ حِسَابٖ

దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు, పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. (a) అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది. (b)

(a) పాపులకు వారి దుష్టకార్యాలకు సరిసమానమైన శిక్షయే ఇవ్వబడుతుంది. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రమే స్వర్గానికి హక్కుదారులు. విశ్వసించక ఎన్ని సత్కార్యాలు చేసినా అవి వ్యర్థమే అవుతాయి. అదే విధంగా సత్కార్యాలు చేయని విశ్వాసి కూడా కేవలం విశ్వాసం ఆధారంగా స్వర్గానికి హక్కుదారుడు కాజాలడు, సత్కార్యాలు చేసి, అల్లాహ్ (సు.తా.) కరుణిస్తే తప్ప. (b) రిజ్ ఖున్: జీవనోపాధి, అంటే కేవలం అన్న పానీయాలే కాక, అన్నీ మంచి వస్తువులు, సుఖసంతోషాలు, తెలివితేటలు మొదలైనవి. ఏవైతే సుఖమయ జీవితానికి అవసరమో!
దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు, పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. (a) అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది. (b)

۞ وَيَٰقَوۡمِ مَا لِيٓ أَدۡعُوكُمۡ إِلَى ٱلنَّجَوٰةِ وَتَدۡعُونَنِيٓ إِلَى ٱلنَّارِ

మరియు నా జాతి ప్రజలారా! ఇది ఎంత విచిత్రమైన విషయం! నేనేమో మిమ్మల్ని ముక్తి వైపునకు పిలుస్తున్నాను. మరియు మీరేమో నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తున్నారు.

تَدۡعُونَنِي لِأَكۡفُرَ بِٱللَّهِ وَأُشۡرِكَ بِهِۦ مَا لَيۡسَ لِي بِهِۦ عِلۡمٞ وَأَنَا۠ أَدۡعُوكُمۡ إِلَى ٱلۡعَزِيزِ ٱلۡغَفَّٰرِ

మీరు నన్ను - అల్లాహ్ ను తిరస్కరించి - ఎవరిని గురించైతే నాకు ఎలాంటి జ్ఞానం లేదో! వారిని, ఆయనకు భాగస్వాములుగా కల్పించమని పిలుస్తున్నారు. మరియు నేనేమో మిమ్మల్ని సర్వశక్తిమంతుని, క్షమాశీలుని వైపునకు పిలుస్తున్నాను.

لَا جَرَمَ أَنَّمَا تَدۡعُونَنِيٓ إِلَيۡهِ لَيۡسَ لَهُۥ دَعۡوَةٞ فِي ٱلدُّنۡيَا وَلَا فِي ٱلۡأٓخِرَةِ وَأَنَّ مَرَدَّنَآ إِلَى ٱللَّهِ وَأَنَّ ٱلۡمُسۡرِفِينَ هُمۡ أَصۡحَٰبُ ٱلنَّارِ

నిస్సందేహంగా! వాస్తవానికి మీరు దేని వైపునకైతే (ప్రార్థించటానికి) నన్ను పిలుస్తున్నారో! దానికి ఇహలోకంలోను మరియు పరలోకంలోను ప్రార్థనా అర్హత లేదు. (a) మరియు నిశ్చయంగా, మనందరి మరలింపు అల్లాహ్ వైపునకే మరియు నిశ్చయంగా, మితి మీరి ప్రవర్తించే వారే నరకాగ్ని వాసులవుతారు.

(a) ఇలాంటి అర్థమిచ్చే వాక్యాల కోసం చూడండి, 46:5, 35:14.
నిస్సందేహంగా! వాస్తవానికి మీరు దేని వైపునకైతే (ప్రార్థించటానికి) నన్ను పిలుస్తున్నారో! దానికి ఇహలోకంలోను మరియు పరలోకంలోను ప్రార్థనా అర్హత లేదు. (a) మరియు నిశ్చయంగా, మనందరి మరలింపు అల్లాహ్ వైపునకే మరియు నిశ్చయంగా, మితి మీరి ప్రవర్తించే వారే నరకాగ్ని వాసులవుతారు.

فَسَتَذۡكُرُونَ مَآ أَقُولُ لَكُمۡۚ وَأُفَوِّضُ أَمۡرِيٓ إِلَى ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ بَصِيرُۢ بِٱلۡعِبَادِ

కావున నేను మీతో చెప్పే విషయం మున్ముందు మీరే తెలుసుకోగలరు. ఇక నా వ్యవహారాన్ని నేను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు."

فَوَقَىٰهُ ٱللَّهُ سَيِّـَٔاتِ مَا مَكَرُواْۖ وَحَاقَ بِـَٔالِ فِرۡعَوۡنَ سُوٓءُ ٱلۡعَذَابِ

ఆ తరువాత అల్లాహ్ అతనిని వారు పన్నిన చెడు కుట్ర నుండి కాపాడాడు. మరియు ఫిరఔన్ జనులను దుర్భరమైన శిక్ష చుట్టుకున్నది.

ٱلنَّارُ يُعۡرَضُونَ عَلَيۡهَا غُدُوّٗا وَعَشِيّٗاۚ وَيَوۡمَ تَقُومُ ٱلسَّاعَةُ أَدۡخِلُوٓاْ ءَالَ فِرۡعَوۡنَ أَشَدَّ ٱلۡعَذَابِ

ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. (a) మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" (b) అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.

(a) గోరీలలో ఉన్నవారు ఉదయం మరియు సాయంత్రం దాని ముందు ప్రవేశ పెట్టబడతారు. ఇదే గోరీల శిక్ష, 'అజాబె ఖబ్ర్!' దీనిని గురించి ఎన్నో 'హదీస్' లు ఉన్నాయి. 'ఆయి'షహ్ (ర.'అన్హా) దైవప్రవక్త ('స'అస) తో ప్రశ్నిస్తే అతను ఇలా అన్నారు:'అవును గోరీల శిక్ష తథ్యం.' ('స'హీ'హ్ బు'ఖారీ) మరొక 'హదీస్' : మీలో ఎవరైనా మరణిస్తే అతనికి ఉదయం మరియు సాయంత్రం అతన చోటు (స్వర్గంలో లేక నరకంలో అతని స్థానం) చూపబడుతుంది. మరియు అతనితో అనబడుతుంది: 'ఇదే నీ గమ్యస్థానం. పునరుత్థఆన దినమున అల్లాహ్ (సు.తా.) నిన్ను ఇక్కడికే పంపుతాడు.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం). చనిపోయిన తరువాత పునరుత్థానదినం వరకు ఉండే కాలాన్ని బర్'జఖ్ అంటారు. (b) ఆల-ఫిర్'ఔన్: అంటే, ఫిర్'ఔన్, అతని జాతివారు మరియు అతని అనుచరులందరూ.
ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. (a) మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" (b) అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.

وَإِذۡ يَتَحَآجُّونَ فِي ٱلنَّارِ فَيَقُولُ ٱلضُّعَفَٰٓؤُاْ لِلَّذِينَ ٱسۡتَكۡبَرُوٓاْ إِنَّا كُنَّا لَكُمۡ تَبَعٗا فَهَلۡ أَنتُم مُّغۡنُونَ عَنَّا نَصِيبٗا مِّنَ ٱلنَّارِ

ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదులాడుతున్నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా పరిగణింపబడిన వారు, పెద్ద మనుషులుగా (నాయకులుగా) పరిగణింపబడే వారితో ఇలా అంటారు: "వాస్తవానికి, మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండే వారము, కావున మీరిప్పుడు మా నుండి నరకాగ్నిని కొంతనైనా తొలగించగలరా?"

قَالَ ٱلَّذِينَ ٱسۡتَكۡبَرُوٓاْ إِنَّا كُلّٞ فِيهَآ إِنَّ ٱللَّهَ قَدۡ حَكَمَ بَيۡنَ ٱلۡعِبَادِ

దుహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: "వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) ఉన్నాం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసుల మధ్య వాస్తవమైన తీర్పు చేశాడు!"

وَقَالَ ٱلَّذِينَ فِي ٱلنَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ٱدۡعُواْ رَبَّكُمۡ يُخَفِّفۡ عَنَّا يَوۡمٗا مِّنَ ٱلۡعَذَابِ

మరియు నరకాగ్నిలో పడివున్న వారు, నరకపు రక్షకులతో: "మా శిక్షను కనీసం ఒక్కరోజు కొరకైనా తగ్గించమని, మీరు మీ ప్రభువును ప్రార్థించండి!" అని అంటారు.

قَالُوٓاْ أَوَلَمۡ تَكُ تَأۡتِيكُمۡ رُسُلُكُم بِٱلۡبَيِّنَٰتِۖ قَالُواْ بَلَىٰۚ قَالُواْ فَٱدۡعُواْۗ وَمَا دُعَٰٓؤُاْ ٱلۡكَٰفِرِينَ إِلَّا فِي ضَلَٰلٍ

వారు (రక్షకులు) అంటారు: "ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవప్రవక్తలు రాలేదా?" అప్పుడు వారంటారు: "అవును (వచ్చారు)!" వారికి ఇలా జవాబివ్వబడుతుంది: "అయితే మీరే ప్రార్థించండి!" కాని సత్యతిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది.

إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَٱلَّذِينَ ءَامَنُواْ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَيَوۡمَ يَقُومُ ٱلۡأَشۡهَٰدُ

నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము. (a)

(a) చూపునరుత్థానదినమున దైవదూతలు మరియు దైవప్రవక్త ('అలైహిమ్. స.) లు సాక్ష్యమిస్తారు. కావున పునరుత్థానదినం, సాక్ష్యాల దినం అని కూడా అనబడుతోంది. ఇంకా చూడండి, 39:69.
నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము. (a)

يَوۡمَ لَا يَنفَعُ ٱلظَّٰلِمِينَ مَعۡذِرَتُهُمۡۖ وَلَهُمُ ٱللَّعۡنَةُ وَلَهُمۡ سُوٓءُ ٱلدَّارِ

ఆరోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది. (a) మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది.

(a) ల'అనతున్: అంటే అల్లాహ్ (సు.తా.) కారుణ్యం నుండి బహిష్కారం.
ఆరోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది. (a) మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది.

وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡهُدَىٰ وَأَوۡرَثۡنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱلۡكِتَٰبَ

మరియు వాస్తవంగా మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రాయీల్ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్ కు) వారసులుగా చేశాము; (a)

(a) చూడండి, 5:44.
మరియు వాస్తవంగా మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రాయీల్ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్ కు) వారసులుగా చేశాము; (a)

هُدٗى وَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ

బుద్ధిమంతులకు మార్గదర్శకత్వంగా మరియు హితోపదేశంగా!

فَٱصۡبِرۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ وَٱسۡتَغۡفِرۡ لِذَنۢبِكَ وَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ بِٱلۡعَشِيِّ وَٱلۡإِبۡكَٰرِ

కావున నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం; నీ పాపాలకు క్షమాపణ వేడుకో మరియు సాయంత్రం మరియు ఉదయం నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయనను స్తుతించు.

إِنَّ ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِيٓ ءَايَٰتِ ٱللَّهِ بِغَيۡرِ سُلۡطَٰنٍ أَتَىٰهُمۡ إِن فِي صُدُورِهِمۡ إِلَّا كِبۡرٞ مَّا هُم بِبَٰلِغِيهِۚ فَٱسۡتَعِذۡ بِٱللَّهِۖ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ

నిశ్చయంగా, ఎవరైతే, తమ దగ్గర, ఎలాంటి ప్రమాణం లేనిదే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి వాదులాడుతారో, వారి హృదయాలలో వాస్తవానికి గొప్పతనపు గర్వం నిండి ఉంది. కాని వారు దానిని (గొప్పతనాన్ని) పొందజాలరు. కావున నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

لَخَلۡقُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ أَكۡبَرُ مِنۡ خَلۡقِ ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ

వాస్తవానికి, ఆకాశాలను మరియు భూమిని స్పష్టించటం, మానవులను సృష్టించటం కంటే ఎంతో గొప్ప విషయం, కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.

وَمَا يَسۡتَوِي ٱلۡأَعۡمَىٰ وَٱلۡبَصِيرُ وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَلَا ٱلۡمُسِيٓءُۚ قَلِيلٗا مَّا تَتَذَكَّرُونَ

మరియు గ్రుడ్డివాడు మరియు చూడగలవాడు సరిసమానులు కాజాలరు మరియు అదే విధంగా! విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు దుర్వర్తనులు కూడా (సమానులు కాజాలరు). మీరు అర్థం చేసుకునేది చాలా తక్కువ!

إِنَّ ٱلسَّاعَةَ لَأٓتِيَةٞ لَّا رَيۡبَ فِيهَا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يُؤۡمِنُونَ

నిశ్చయంగా, అంతిమ ఘడియ తప్పక రానున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది ప్రజలు విశ్వసించరు.

وَقَالَ رَبُّكُمُ ٱدۡعُونِيٓ أَسۡتَجِبۡ لَكُمۡۚ إِنَّ ٱلَّذِينَ يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِي سَيَدۡخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. (a) నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు."

(a) 'హదీస్' : "అద్దు'ఆఉ హువల్ 'ఇబాదహ్, వ అద్దు'ఆఉ ముఖ్ఖుల్ 'ఇబాదహ్." దు'ఆ అంటే ఇక్కడ చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలో 'ఇబాదహ్ అంటే నమా'జ్. (ముస్నద్ అ'హ్మద్ 4/271) ఇంకా చూడండి, 2:186.
మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. (a) నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు."

ٱللَّهُ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلَّيۡلَ لِتَسۡكُنُواْ فِيهِ وَٱلنَّهَارَ مُبۡصِرًاۚ إِنَّ ٱللَّهَ لَذُو فَضۡلٍ عَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَشۡكُرُونَ

అల్లాహ్! ఆయనే, మీ కొరకు విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మరియు (చూడటానికి) ప్రకాశవంతమైన పగటిని నియమించినవాడు. (a) నిశ్చయంగా, అల్లాహ్ ప్రజల పట్ల ఎంతో అనుగ్రహుడు, కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు తెలుపరు.

(a) చూడండి, 27:86.

ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ خَٰلِقُ كُلِّ شَيۡءٖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُؤۡفَكُونَ

ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? (a)

(a) చూడండి, 5:75, చివరి వాక్యం.
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? (a)

كَذَٰلِكَ يُؤۡفَكُ ٱلَّذِينَ كَانُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ يَجۡحَدُونَ

ఇదే విధంగా, అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించే వారందరూ మోసగింపబడుతూ ఉంటారు.

ٱللَّهُ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ قَرَارٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَصَوَّرَكُمۡ فَأَحۡسَنَ صُوَرَكُمۡ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡۖ فَتَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ

అల్లాహ్ యే! మీ కొరకు భూమిని నివాస స్థలంగా మరియు ఆకాశాన్ని కప్పుగా నియమించిన వాడు మరియు ఆయనే మీకు మంచి రూపాన్నిచ్చి దానిని ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు మరియు మీకు మంచి వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాడు. ఆయనే అల్లాహ్! మీ పోషకుడు. కావున అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వలోకాలకు ప్రభువు.

هُوَ ٱلۡحَيُّ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَٱدۡعُوهُ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَۗ ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఆయన సజీవుడు. (a) ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వస్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే.

(a) అల్-'హయ్యు: సజీవుడు, నిత్యజీవుడు, చూడండి, 2:255.
ఆయన సజీవుడు. (a) ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వస్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే.

۞ قُلۡ إِنِّي نُهِيتُ أَنۡ أَعۡبُدَ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَمَّا جَآءَنِيَ ٱلۡبَيِّنَٰتُ مِن رَّبِّي وَأُمِرۡتُ أَنۡ أُسۡلِمَ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ

ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువు తరఫు నుండి, నాకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాతనే, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవాటి ఆరాధన నుండి నేను వారించబడ్డాను మరియు నేను సర్వలోకాల ప్రభువుకు మాత్రమే విధేయుడను (ముస్లింను) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను."

هُوَ ٱلَّذِي خَلَقَكُم مِّن تُرَابٖ ثُمَّ مِن نُّطۡفَةٖ ثُمَّ مِنۡ عَلَقَةٖ ثُمَّ يُخۡرِجُكُمۡ طِفۡلٗا ثُمَّ لِتَبۡلُغُوٓاْ أَشُدَّكُمۡ ثُمَّ لِتَكُونُواْ شُيُوخٗاۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبۡلُۖ وَلِتَبۡلُغُوٓاْ أَجَلٗا مُّسَمّٗى وَلَعَلَّكُمۡ تَعۡقِلُونَ

ఆయనే, మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. (a) తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్తముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్తవయస్సులో బలం గలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది).

(a) చూడండి, 3:59, 11:61, 22:5, 30:20. ఈ ఆయత్ లో, 'తురాబ్' తో సృష్టించాడని ఉంది.
ఆయనే, మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. (a) తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్తముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్తవయస్సులో బలం గలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది).

هُوَ ٱلَّذِي يُحۡيِۦ وَيُمِيتُۖ فَإِذَا قَضَىٰٓ أَمۡرٗا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ

జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు, కేవలం దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే అది ఆయిపోతుంది.

أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِيٓ ءَايَٰتِ ٱللَّهِ أَنَّىٰ يُصۡرَفُونَ

ఏమీ? నీకు తెలియదా? అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి వాదులాడేవారు ఏ విధంగా (సత్యం నుండి) తప్పించబడుతున్నారో?

ٱلَّذِينَ كَذَّبُواْ بِٱلۡكِتَٰبِ وَبِمَآ أَرۡسَلۡنَا بِهِۦ رُسُلَنَاۖ فَسَوۡفَ يَعۡلَمُونَ

ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్కరించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని (తిరస్కరించారో), వారు తప్పక త్వరలోనే (తమ పర్యవసానం) తెలుసుకుంటారు;

إِذِ ٱلۡأَغۡلَٰلُ فِيٓ أَعۡنَٰقِهِمۡ وَٱلسَّلَٰسِلُ يُسۡحَبُونَ

ఎప్పుడైతే వారి మెడలలో సంకెళ్ళు (a) (ఇనుప పట్టీలు) మరియు గొలుసులు వేయబడతాయో మరియు వారు ఈడ్చబడతారో!

(a) మెడలలో సంకెళ్ళ - కొరకు, చూడండి, 13:5, 34:33 మరియు 36:8.
ఎప్పుడైతే వారి మెడలలో సంకెళ్ళు (a) (ఇనుప పట్టీలు) మరియు గొలుసులు వేయబడతాయో మరియు వారు ఈడ్చబడతారో!

فِي ٱلۡحَمِيمِ ثُمَّ فِي ٱلنَّارِ يُسۡجَرُونَ

సలసలకాగే నీళ్ళలోకి; తరువాత నరకాగ్నిలోకి కాల్చబడటానికి.

ثُمَّ قِيلَ لَهُمۡ أَيۡنَ مَا كُنتُمۡ تُشۡرِكُونَ

అప్పుడు వారితో అనబడుతుంది: "మీరు సాటి కల్పించే (భాగస్వాములు) ఇప్పుడు ఎక్కడున్నారు?

مِن دُونِ ٱللَّهِۖ قَالُواْ ضَلُّواْ عَنَّا بَل لَّمۡ نَكُن نَّدۡعُواْ مِن قَبۡلُ شَيۡـٔٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ ٱلۡكَٰفِرِينَ

(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: "వారు మమ్మల్ని త్యజించారు! అలా కాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." (a) ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.

(a) చూడండి, 6:23.

ذَٰلِكُم بِمَا كُنتُمۡ تَفۡرَحُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَبِمَا كُنتُمۡ تَمۡرَحُونَ

(వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు అన్యాయంగా, భూమిలో విర్రవీగుతూ ఉన్నందుకు మరియు దురభిమానంతో ప్రవర్తించినందుకూ!

ٱدۡخُلُوٓاْ أَبۡوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۖ فَبِئۡسَ مَثۡوَى ٱلۡمُتَكَبِّرِينَ

(కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాస స్థలం ఎంత దుర్భరమైనది!"

فَٱصۡبِرۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعۡضَ ٱلَّذِي نَعِدُهُمۡ أَوۡ نَتَوَفَّيَنَّكَ فَإِلَيۡنَا يُرۡجَعُونَ

కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు! (a)

(a) చూడండి, 10:46.

وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ مِنۡهُم مَّن قَصَصۡنَا عَلَيۡكَ وَمِنۡهُم مَّن لَّمۡ نَقۡصُصۡ عَلَيۡكَۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأۡتِيَ بِـَٔايَةٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ فَإِذَا جَآءَ أَمۡرُ ٱللَّهِ قُضِيَ بِٱلۡحَقِّ وَخَسِرَ هُنَالِكَ ٱلۡمُبۡطِلُونَ

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ప్రవక్త కూడా ఏ అద్భుత క్రియలను (ఆయాత్ లను) స్వయంగా చేయలేడు. (a) కాని అల్లాహ్ ఆజ్ఞ వచ్చినపుడు, న్యాయంగా తీర్పు చేయబడుతుంది. మరియు అప్పుడు అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.

(a) చూడండి, 6:109. అద్భుత క్రియలు (ము'ఆజి'జాత్) కేవలం అల్లాహ్ (సు.తా.) అధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరినప్పుడే వాటిని చూపిస్తాడు. పూర్వకాలపు చాలా మంది ప్రవక్తల జాతి ప్రజలు, అద్భుతక్రియలు చూసి కూడా విశ్వసించలేదు.
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ప్రవక్త కూడా ఏ అద్భుత క్రియలను (ఆయాత్ లను) స్వయంగా చేయలేడు. (a) కాని అల్లాహ్ ఆజ్ఞ వచ్చినపుడు, న్యాయంగా తీర్పు చేయబడుతుంది. మరియు అప్పుడు అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.

ٱللَّهُ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَنۡعَٰمَ لِتَرۡكَبُواْ مِنۡهَا وَمِنۡهَا تَأۡكُلُونَ

అల్లాహ్ మీ కొరకు పశువులను సృష్టించాడు, వాటి మీద మీరు సవారీ చేయటానికి మరియు వాటిలో కొన్నింటిని మీరు తినుటకూను! (a)

(a) చూడండి, 6:143-144.
అల్లాహ్ మీ కొరకు పశువులను సృష్టించాడు, వాటి మీద మీరు సవారీ చేయటానికి మరియు వాటిలో కొన్నింటిని మీరు తినుటకూను! (a)

وَلَكُمۡ فِيهَا مَنَٰفِعُ وَلِتَبۡلُغُواْ عَلَيۡهَا حَاجَةٗ فِي صُدُورِكُمۡ وَعَلَيۡهَا وَعَلَى ٱلۡفُلۡكِ تُحۡمَلُونَ

మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు కోరిన చోట్లకు పోవటానికి ఉపయోగపడతాయి మరియు వాటి మీద మరియు పడవల మీద మీరు తీసుకు పోబడతారు.

وَيُرِيكُمۡ ءَايَٰتِهِۦ فَأَيَّ ءَايَٰتِ ٱللَّهِ تُنكِرُونَ

మరియు (ఈ విధంగా) ఆయన మీకు తన సూచనలను (ఆయాత్ లను) చూపుతున్నాడు. అయితే అల్లాహ్ యొక్క ఏ ఏ సూచనలను (ఆయాత్ లను) మీరు నిరాకరిస్తారు?

أَفَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَانُوٓاْ أَكۡثَرَ مِنۡهُمۡ وَأَشَدَّ قُوَّةٗ وَءَاثَارٗا فِي ٱلۡأَرۡضِ فَمَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يَكۡسِبُونَ

ఏమీ? వీరు భూమిలో సంచరించలేదా? అప్పుడు వీరికి పూర్వం గతించిన వారి గతి ఏమయిందో కనిపించలేదా? వారు వీరి కంటే సంఖ్యాపరంగా అధికులు మరియు వీరి కంటే ఎక్కువ బలవంతులు మరియు భూమిలో (ఎక్కువ) చిహ్నాలు వదలి పోయారు, కాని వారి సంపాదన వారికి ఏ విధంగానూ పనికి రాలేదు.

فَلَمَّا جَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَرِحُواْ بِمَا عِندَهُم مِّنَ ٱلۡعِلۡمِ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ

ఎందుకంటే! వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పుడు, వారు తమ దగ్గరున్న జ్ఞానానికి గర్వపడ్డారు; కాబట్టి వారు దేనిని గురించి పరిహాసాలాడుతూ ఉన్నారో అదే వారిని చుట్టుకున్నది.

فَلَمَّا رَأَوۡاْ بَأۡسَنَا قَالُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَحۡدَهُۥ وَكَفَرۡنَا بِمَا كُنَّا بِهِۦ مُشۡرِكِينَ

ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: "మేము అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము మరియు మేము (అల్లాహ్ కు) సాటి కల్పిస్తూ వచ్చిన భాగస్వాములను తిరస్కరిస్తున్నాము."

فَلَمۡ يَكُ يَنفَعُهُمۡ إِيمَٰنُهُمۡ لَمَّا رَأَوۡاْ بَأۡسَنَاۖ سُنَّتَ ٱللَّهِ ٱلَّتِي قَدۡ خَلَتۡ فِي عِبَادِهِۦۖ وَخَسِرَ هُنَالِكَ ٱلۡكَٰفِرُونَ

కాని మా శిక్షను చూసిన తర్వాత, వారి విశ్వాసం వారికి ఏ మాత్రం లాభదాయకం కాజాలదు. ఇదే అల్లాహ్ తన దాసుల కొరకు వాస్తవంగా, నియమించిన విధానం (సాంప్రదాయం). మరియు అక్కడ సత్యతిరస్కారులు నష్టానికి గురి అవుతారు.

Footer Include